Page Loader
OTT Platforms:  ఓటీటీ కంటెంట్‌పై కేంద్రం వార్నింగ్‌.. ఆ సన్నివేశాలు ఉంటే కఠిన చర్యలు 
ఓటీటీ కంటెంట్‌పై కేంద్రం వార్నింగ్‌.. ఆ సన్నివేశాలు ఉంటే కఠిన చర్యలు

OTT Platforms:  ఓటీటీ కంటెంట్‌పై కేంద్రం వార్నింగ్‌.. ఆ సన్నివేశాలు ఉంటే కఠిన చర్యలు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 17, 2024
05:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లపై కంటెంట్ నియంత్రణ లేకపోవడంతో సినీ ప్రియులు, పౌరసమాజం నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లకు కఠిన హెచ్చరికలు జారీ చేసింది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓటీటీ ఫారమ్‌లకు ప్రత్యేక అడ్వైజరీను విడుదల చేసింది. వెబ్‌సిరీస్‌లు, సినిమాలు వంటి కంటెంట్‌లో మత్తు పదార్థాల వినియోగాన్ని ప్రోత్సహించే సన్నివేశాలను చూపించడం లేదా గ్లామరైజ్ చేయడం అసహ్యకరమని కేంద్రం స్పష్టం చేసింది. ఇలాంటి సన్నివేశాలు యూత్‌పై ప్రతికూల ప్రభావం చూపించవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. మత్తు పదార్థాల వినియోగానికి సంబంధించిన సన్నివేశాలను చూపించాల్సిన పరిస్థితుల్లో తప్పనిసరిగా హెచ్చరికల స్లైడ్స్‌ ఉంచాలని కేంద్రం ఆదేశించింది.

Details

మత్తు పదార్థాలను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు

ఈ రకమైన కంటెంట్‌తో యువత మానసికంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని గుర్తు చేసింది. ఓటీటీ కంటెంట్‌లో డ్రగ్స్‌ వినియోగం, ప్రోత్సాహం ఉంటే దానిపై ప్రభుత్వం కఠినంగా స్పందిస్తుందని హెచ్చరించింది. అవసరమైతే ఈ కంటెంట్‌పై దర్యాప్తు జరుపుతామని స్పష్టం చేసింది. సినిమాలు, వెబ్‌సిరీస్‌లకు సెన్సార్‌ విధానాన్ని అమలు చేయాలని ఇప్పటికే డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ అడ్వైజరీని తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తానికి ఓటీటీ కంటెంట్‌కు సంబంధించి నియంత్రణ క్రమం దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.