LOADING...
Kaantha: విడుదల డేట్ ఫిక్స్ చేసుకున్న కాంత‌.. సోలోగా వ‌స్తోన్న దుల్కర్ స‌ల్మాన్
విడుదల డేట్ ఫిక్స్ చేసుకున్న కాంత‌.. సోలోగా వ‌స్తోన్న దుల్కర్ స‌ల్మాన్

Kaantha: విడుదల డేట్ ఫిక్స్ చేసుకున్న కాంత‌.. సోలోగా వ‌స్తోన్న దుల్కర్ స‌ల్మాన్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 20, 2025
01:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

'లక్కీ భాస్కర్'తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దుల్కర్ సల్మాన్, ప్రస్తుతం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా తన కెరీర్‌లో బిజీగా కొనసాగుతున్నాడు. ఈ ఏడాది ఆయన ప్రొడక్షన్ హౌస్‌ నుంచి విడుదలైన లోక చాప్టర్ 1 కేరళ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి, ఆ బ్యానర్‌కి పెద్ద హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఆయన నిర్మిస్తున్న కాంత అనే పీరియడ్ డ్రామా సినిమాపై ప్రేక్షకులందరి దృష్టి పడింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రం సెప్టెంబర్‌లో విడుదల కావాల్సి ఉన్నా, లోక చాప్టర్ 1 కేరళలో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న కారణంగా రిలీజ్‌ను వాయిదా వేశారు.

వివరాలు 

నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు..  

చివరికి మేకర్స్ కొత్త రిలీజ్ డేట్‌ను ఖరారు చేశారు. కాంత సినిమాను నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా ప్రధాన పాత్రల గ్లింప్స్‌ను విడుదల చేస్తూ, రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నాడు. నవంబర్ 14న ఇతర పెద్ద సినిమాలు రిలీజ్ కావడం లేదని, కాంత సోలోగా విడుదల కానుండటంతో ఎలాంటి పోటీ ఉండదు. మొదటి రోజు నుంచే మంచి టాక్ వస్తే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టడం ఖాయం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రానా దగ్గుబాటి చేసిన ట్వీట్