Kaantha Teaser: దుల్కర్ సల్మాన్ 'కాంత'.. టీజర్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
దుల్కర్ సల్మాన్ పేరుకే మలయాళ హీరో కానీ, తెలుగులోనూ తనకంటూ ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని ఏర్పరచుకున్నాడు. ప్రత్యేకించి 'మహానటి', 'సీతారామం' వంటి చిత్రాల విజయంతో ఆయనకు స్ట్రెయిట్ తెలుగు హీరోలతో పోలిస్తే మరింత క్రేజ్ దక్కింది. ఈ విజయాలను కొనసాగిస్తూ ఆయన నటించిన తాజా చిత్రం 'కాంత'. ప్రముఖ నటుడు రానా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇది ఒక పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్ కలిగిన కథాంశంతో తెరకెక్కుతోంది. తాజాగా దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఇదివరకు 'మహానటి'లో శివాజీ గణేషన్ పాత్రలో కనిపించిన దుల్కర్, తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తాజాగా 'కాంత' చిత్రంలోనూ 1960ల కాలంలో ఓ స్టార్ హీరోగా కనిపించనున్నాడు.
వివరాలు
'శాంత' అనే హారర్ సినిమాలో దుల్కర్, భాగ్యశ్రీ బోర్సే
టీజర్‌ను గమనిస్తే, దుల్కర్ ఓ ప్రముఖ హీరో పాత్రలో, సముద్రఖని ఓ నిర్మాత పాత్రలో కనిపిస్తారు. కెరీర్ ప్రారంభంలో వీరిద్దరూ స్నేహపూర్వకంగా ముందుకు సాగుతారు. కానీ కాలక్రమేణా వారి మధ్య విభేదాలు ఏర్పడి విడిపోతారు. ఈ పరిణామాల నేపథ్యంలో సముద్రఖని తెరకెక్కించబోతున్న'శాంత' అనే హారర్ సినిమాలో దుల్కర్, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటిస్తారు. ఆ సినిమా తీయడంలో ఎదురైన పరిస్థితులే ఈ సినిమా కథగా తెలుస్తోంది. దుల్కర్,సముద్రఖనిల మధ్య ఏమి జరిగింది? వారి ప్రయాణంలో వచ్చిన మలుపులేమిటి? అనే అంశాలే ప్రధానంగా సినిమాను నడిపించేలా కనిపిస్తోంది.
వివరాలు
భిన్నమైన కాన్సెప్ట్‌తో సినిమా
టీజర్‌ను చూస్తేనే ఇది ఓ భిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న సినిమా అనే అభిప్రాయం కలుగుతోంది. ఇందులో దుల్కర్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించగా, దర్శకత్వాన్ని సెల్వమణి సెల్వరాజ్ వహిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దుల్కర్ మరో విజయం నమోదు చేయబోతున్నాడనే నమ్మకాన్ని టీజర్ ఇస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్
#Kaantha Teaser Out Now -https://t.co/5VX0eDrrL5#KaanthaTeaser #DulquerSalmaan #DQ #RanaDaggubati pic.twitter.com/O4QCgA9q3E
— SocialXpose (@socialxpose) July 28, 2025