Loading...
Aakasamlo Oka Tara: బుక్‌మైషోలో దుల్కర్ సల్మాన్‌ సినిమా జోరు.. తొలి వీకెండ్‌లో భారీ బుకింగ్స్
బుక్‌మైషోలో దుల్కర్ సల్మాన్‌ సినిమా జోరు.. తొలి వీకెండ్‌లో భారీ బుకింగ్స్

Aakasamlo Oka Tara: బుక్‌మైషోలో దుల్కర్ సల్మాన్‌ సినిమా జోరు.. తొలి వీకెండ్‌లో భారీ బుకింగ్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2026
11:34 am

ఈ వార్తాకథనం ఏంటి

దుల్కర్ సల్మాన్‌ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆకాశంలో ఒక తార' సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. నవంబర్‌ 20న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ మౌత్‌ టాక్‌ లభిస్తోంది. దీంతో తొలి మూడు రోజుల్లోనే ప్రముఖ టికెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ బుక్‌మైషోలో 3.02 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి.

వివరాలు

రోజురోజుకీ పెరిగిన బుకింగ్స్

విడుదలైన మొదటి రోజు నుంచి మూడో రోజు వరకు ఈ సినిమా టికెట్ల విక్రయాల్లో క్రమంగా వృద్ధి కనిపించింది. ట్రేడ్‌ వర్గాలు వెల్లడించిన బుక్‌మైషో గణాంకాల ప్రకారం రోజువారీ టికెట్ల అమ్మకాలు ఇలా ఉన్నాయి.

శుక్రవారం (మొదటి రోజు): 79,000 టికెట్లు

శనివారం (రెండో రోజు): 1,08,200 టికెట్లు

ఆదివారం (మూడో రోజు): 1,15,500 టికెట్లు ఈ లెక్కల ప్రకారం తొలి వీకెండ్‌లో మూడు రోజుల్లోనే మొత్తం 3,02,700 టికెట్లు అమ్ముడయ్యాయి.

రోజురోజుకీ బుకింగ్స్‌ పెరగడం సినిమాకు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణను సూచిస్తోంది.

వివరాలు

వ్యోమగామి కావాలనే యువతి కల చుట్టూ కథ

స్ఫూర్తిదాయక డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌ 'కృష్ణ' పాత్రలో నటించారు. సాత్విక వీరవల్లి 'కల్పన' పాత్రతో తెలుగు తెరకు పరిచయమయ్యారు.

ఓ మారుమూల గ్రామానికి చెందిన యువతి వ్యోమగామి (ఆస్ట్రోనాట్‌) కావాలనే తన కలను ఎలా నెరవేర్చుకుందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

ఇందులో శ్రుతి హాసన్‌, రుహాని శర్మ, మురళీ శర్మ, గౌతమ్ వాసుదేవ్ మీనన్‌ కీలక పాత్రలు పోషించారు.

ADVERTISEMENT