LOADING...
Dulquer Salmaan : దసరా నిర్మాతతో దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా ప్రారంభం!
దసరా నిర్మాతతో దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా ప్రారంభం!

Dulquer Salmaan : దసరా నిర్మాతతో దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా ప్రారంభం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 04, 2025
05:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

మలయాళ స్టార్ హీరో అయినా, దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమాల్లో తనదైన మార్క్ చూపిస్తున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన సీతారామం, లక్కీ భాస్కర్ వంటి సినిమాలు మంచి హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ తన కెరీర్‌లో 41వ సినిమాను ప్రారంభించాడు. ఈ చిత్రం నేడు గ్రాండ్ ఓపెనింగ్‌తో మొదలైంది. ఈ సినిమాను దసరా ఫేమ్ నిర్మాత సుధాకర్ చెరుకూరి తన ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై పదో చిత్రంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ సినిమాకు రవి నేలకుదిటి దర్శకత్వం వహించనున్నారు. నేటి యువతను ఆకట్టుకునే కాంటెంపరరీ లవ్ స్టోరీగా ఈ సినిమా ఉండబోతోందని సమాచారం.

Details

ముఖ్య అతిథిగా హాజరైన నాని

ఈ రోజు పూజా కార్యక్రమం జరగగా, హీరో నాని ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ముహూర్తపు సన్నివేశానికి నాని క్లాప్ కొట్టాడు. దర్శకుడు బుచ్చిబాబు సానా కెమెరా స్విచ్ ఆన్ చేయగా, గుణ్ణం సందీప్, నాని, గుణ్ణం రమ్య కలిసి స్క్రిప్ట్‌ను టీమ్‌కు అందించారు. ఫస్ట్ షాట్‌ను దర్శకుడే స్వయంగా తెరకెక్కించాడు. దసరా, ది పారడైజ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. దుల్కర్ సల్మాన్ కొత్త సినిమాకు ఇదే ఆరంభమైతే, దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.