Teaser Talk: ఆసక్తికరంగా దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' టీజర్
ఈ వార్తాకథనం ఏంటి
మాలీవుడ్ హార్ట్‌త్రోబ్ దుల్కర్ సల్మాన్ తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి కాంబోలో వస్తున్న సినిమా 'లక్కీ భాస్కర్'.
ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. నేడు ఈ మూవీ నుండి టీజర్ ని రిలీజ్ చేసారు.
బాంబేలోని మగడా బ్యాంక్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్న భాస్కర్ అకౌంట్ లోకి ఒక్కసారిగా ఎంతో భారీ మొత్తంలో డబ్బు జమ అవడం, అనంతరం అతడి లైఫ్ మారడం, ఆ డబ్బుని అతడు పూర్తిగా ఖర్చు చేసి జీరో బ్యాలన్స్ కి తీసుకురావడం వంటి అంశాలు టీజర్ లో చూపించారు.
ఇక టీజర్ లో దుల్కర్ తన మార్క్ స్టైల్, లుక్స్, యాక్టింగ్ తో ఆకట్టుకోగా,విజువల్స్,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి.
Details
జూలైలో విడుదల కానున్న లక్కీ భాస్కర్
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా నిర్మించిన లక్కీ భాస్కర్ సినిమాను జూలైలో తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు
ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మేకర్స్ చేసిన ట్వీట్
A Common... Middle Class… Indian Man! 💰
— Sithara Entertainments (@SitharaEnts) April 11, 2024
Dive into the extra-ordinary world of #LuckyBaskhar! 🏦💥#LuckyBaskharTeaser ▶️ https://t.co/PIYHj0ojpJ@dulQuer #VenkyAtluri @gvprakash @Meenakshiioffl @vamsi84 @NimishRavi @NavinNooli @Banglan16034849 #SaiSoujanya @SitharaEnts… pic.twitter.com/zqCP1QLpjO