Page Loader
OTT Movies: సినీ ప్రేమికులకు దసరా ప్రత్యేకం.. థియేటర్లతో పాటు ఓటీటీలోకి వచ్చే సినిమాలివే! 
సినీ ప్రేమికులకు దసరా ప్రత్యేకం.. థియేటర్లతో పాటు ఓటీటీలోకి వచ్చే సినిమాలివే!

OTT Movies: సినీ ప్రేమికులకు దసరా ప్రత్యేకం.. థియేటర్లతో పాటు ఓటీటీలోకి వచ్చే సినిమాలివే! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 07, 2024
11:18 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ వారం దసరా పండుగ సందడి మొదలైపోయింది! నవరాత్రుల ఉత్సవాలు కేవలం ఆలయాలకే కాదు, థియేటర్లు, ఓటీటీలకూ కొత్త ఉత్సాహం తెచ్చాయి. ప్రతి ఒక్కరూ పండుగ మూడ్‌లో బిజీగా ఉండగా, సినీ ప్రేక్షకుల కోసం భారీ చిత్రాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఈ పండుగ సీజన్‌లో మీ ఫేవరిట్ స్టార్‌ల సినిమాలు తెరపై సందడి చేయనున్నాయి. రజినీ కాంత్ తన అభిమానుల కోసం 'వెట్టైయాన్' తో థియేటర్లలో హల్‌చల్ చేయనున్నాడు. సుధీర్ బాబు 'మా నాన్న సూపర్ హీరో', సుహాస్ 'జనక అయితే గనక', గోపీచంద్ 'విశ్వం' లాంటి సినిమాలు దసరా సీజన్‌లో ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి.

Details

ఓటీటీలో ఇంట్లోనే పండుగ వాతావరణం

కుటుంబంతో కలిసి ఇంట్లోనే కూర్చొని సినిమాలు చూడాలనుకునే వారి కోసం ఓటీటీల్లో కొన్ని మంచి చిత్రాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. పెద్ద చిత్రాలు కాకపోయినా, ఆకట్టుకునే కథలతో కొన్ని సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకర్షించగలవు. వీటిలో ఇటీవల హిట్‌గా నిలిచిన శ్రద్ధా కపూర్ 'స్త్రీ 2', అక్షయ్ కుమార్ 'సర్ఫీరా', సుహాస్ 'గొర్రెపురాణం', అమలాపాల్ 'లెవెల్ క్రాస్' వంటి చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. పండుగ సీజన్‌లో మీకు థియేటర్లలో కొత్త సినిమా అనుభవం కావాలా? లేక ఇంట్లోనే ఓటిటి లో మంచి సినిమాలతో ఎంజాయ్ చేయాలా? మీరే డిసైడ్ చేసుకోండి!

Details

ఓటీటీలో వచ్చే సినిమాల లిస్ట్

నెట్‌ఫ్లిక్స్‌ ది మెహండెజ్ బ్రదర్స్(క్రైమ్ డాక్యుమెంటరీ)- అక్టోబర్ 07 యంగ్‌ షెల్డన్‌ (ఇంగ్లీష్‌) అక్టోబరు 8 ఖేల్‌ ఖేల్‌ మే(హిందీ సినిమా)- అక్టోబర్ 09 స్టార్టింగ్ 5(వెబ్ సిరీస్)- అక్టోబర్ 09 గర్ల్ హాంట్స్‌ బాయ్- అక్టోబర్ 10 మాన్‌స్టర్‌ హై 2 (ఇంగ్లీష్‌) అక్టోబరు 10 ఔటర్ బ్యాంక్స్ సీజన్‌-4 పార్ట్-1(వెబ్ సిరీస్)- అక్టోబర్ 10 టాంబ్ రైడర్: ది లెజెండ్ ఆఫ్ లారా క్రాఫ్ట్(యానిమేటేడ్ సిరీస్)- అక్టోబర్ 10 లోన్‌లి ప్లానెట్- అక్టోబర్ 11 అప్‌ రైజింగ్‌ (కొరియన్‌ సిరీస్‌) -అక్టోబర్ 11 ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ (టాక్‌ షో) -అక్టోబర్ 12

details

ఓటీటీలో వచ్చే సినిమాల లిస్ట్ (2)

సోనీ లివ్ జై మహేంద్రన్‌ (మలయాళం)-అక్టోబర్ 11 రాత్ జవాన్ హై- (హిందీ వెబ్ సిరీస్)- ‍అక్టోబర్ 11 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సర్ఫీరా(బాలీవుడ్ సినిమా)- అక్టోబర్ 11 వారై (తమిళ సినిమా)- అక్టోబర్ 11 అమెజాన్ ప్రైమ్ వీడియో సిటాడెల్: డయానా- ‍అక్టోబర్ 10 జియో సినిమా గుటర్‌ గూ (హిందీ)- అక్టోబర్ 11 టీకప్‌ (హాలీవుడ్‌)- అక్టోబర్ 11 యాపిల్ టీవీ ప్లస్ డిస్‌క్లైమర్- అక్టోబర్ 11 ఆహా లెవెల్ క్రాస్- (మలయాళ సినిమా)- ‍అక్టోబర్ 11 (రూమర్ డేట్) గొర్రె పురాణం-(తెలుగు సినిమా)- ‍అక్టోబర్ 11 (రూమర్ డేట్)