Prabhas: జపాన్‌లో భూకంపం కలకలం.. ప్రభాస్ సేఫ్ అంటూ మారుతి క్లారిటీ!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం ప్రభాస్ జపాన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ అకస్మాత్తుగా జపాన్ ఉత్తర తీరంలో భారీ భూకంపం (Japan Earthquake) సంభవించడంతో, ఆయన ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెడుతూ ప్రభాస్ క్షేమం గురించి ఆరా తీశారు. ఈ నేపథ్యంలో దర్శకుడు మారుతి స్వయంగా స్పందించి అభిమానులకు ధైర్యం చెప్పారు. ఓ అభిమాని జపాన్‌లో భూకంపం వచ్చిందట. సునామీ అలర్ట్ కూడా ఇచ్చారు. మా హీరో ఎక్కడ ఉన్నాడు? ఈరోజే తిరిగి వస్తాడా అని మారుతిని ట్యాగ్ చేస్తూ ప్రశ్నించాడు. దానికి మారుతి వెంటనే స్పందిస్తూ, "ప్రభాస్‌తో ఇప్పుడే మాట్లాడాను.
Details
జనవరి 9న రాజాసాబ్ రిలీజ్
భూకంపం వచ్చిన ప్రాంతంలో ఆయన లేరు. పూర్తి క్షేమంగా ఉన్నారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. ఈ సమాధానంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. 'బాహుబలి: ది ఎపిక్' డిసెంబర్ 12న జపాన్‌లో విడుదల కానున్న నేపథ్యంలో, ప్రమోషన్ కోసం ప్రభాస్ అక్కడికి వెళ్లి, జపనీస్ అభిమానులతో సందడి చేస్తున్నారు. అంతేకాక మరోవైపు మారుతి-ప్రభాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'ది రాజాసాబ్' (The Rajasaab) ప్రచార కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. జనవరి 9న విడుదల కానున్న ఈ చిత్రంలోని రెండో పాటను త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం.