LOADING...
Sonu Sood: నిషేధిత యాప్‌ల ప్రమోషన్ కేసులో సోనూసూద్‌కు ఈడీ నోటీసు
నిషేధిత యాప్‌ల ప్రమోషన్ కేసులో సోనూసూద్‌కు ఈడీ నోటీసు

Sonu Sood: నిషేధిత యాప్‌ల ప్రమోషన్ కేసులో సోనూసూద్‌కు ఈడీ నోటీసు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 16, 2025
01:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా దుమారం రేపిన బెట్టింగ్ యాప్ కేసులో తాజాగా స్టార్ నటుడు 'సోనూ సూద్'ను టార్గెట్‌గా ఈడీ సమన్లు జారీ చేసింది. 1xBet బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌కు సంబంధించి ఈడీ సోనూసూద్‌ను ఈనెల 24న ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అక్రమ బెట్టింగ్ యాప్‌లపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ యాప్‌లు కోట్లు రూపాయలలో వ్యక్తులు, పెట్టుబడిదారులను మోసం చేసినట్లయిన, అలాగే భారీ మొత్తంలో పన్ను ఎగవేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇదే కారణంగా, నిషేధిత బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే ఈడీ విచారణకు హాజరయ్యారు.

Details

మాజీ క్రికెటర్లపై కూడా విచారణ

టాలీవుడ్ నుండి విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి వంటి ప్రముఖులు విచారణకు వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ క్రికెటర్లు కూడా టార్గెట్ అయ్యారు. శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, సురేశ్ రైనాలను ఈడీ విచారించింది. ప్రత్యేకంగా శిఖర్ ధావన్‌ను ఈ నెల 4న ఈడీ ఎనిమిది గంటల పాటు విచారించింది. ఈ కేసు దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్‌లు, వాటి ప్రమోషన్‌కు సంబంధించిన నిబంధనలు, సెలబ్రిటీల బాధ్యతపై కొత్త చర్చలకు దారితీస్తోంది.