
హీరో నవదీప్‌కు ఈడీ నోటీసులు.. టాలీవుడ్‌లో ప్రకంపనలు!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌ను డ్రగ్స్ కేసు వెంటాడుతూనే ఉంది. ఈ కేసులో హీరో నవదీప్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే నార్కోటిక్స్ బ్యూరో విచారణ ఎదుర్కొంటున్న నవదీప్‌కు తాజాగా ఈడీ అధికారులు షాకిచ్చారు.
అతనికి ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
నార్కోటిక్స్ బ్యూరో అధికారుల కేసు ఆధారంగా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఈనెల 10వ తేదీన నవదీప్‌ను ఈడీ ఎదుట హాజరుకావాలని నోటీసులో చెప్పారు.
Details
మరోసారి నవదీప్ ను విచారించనున్న పోలీసులు
ఇటీవల మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్‌ను నార్కోటిక్స్ పోలీసులు విచారించారు. అప్పుడు 6 గంటల పాటు విచారించిన పోలీసులు, తర్వాత అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అతడి వాట్సాప్ చాటింగ్‌ను అధికారులు రిట్రీవ్ చేయనున్నట్లు సమాచారం.
ఇక డేటా అందిన తర్వాత మరోసారి నవదీప్‌ను పోలీసులు విచారించనున్నారు.
డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన రామ చందర్ అనే వ్యక్తి తనకు పరిచయం ఉన్న మాట నిజమేనని, కానీ తాను ఎక్కడ డ్రగ్స్ తీసుకోలేదని నవదీప్ పేర్కొన్నాడు.