Page Loader
Manchu Vishnu: ఎన్నికల కోడ్ కేసు.. సుప్రీంకోర్టును అశ్రయించిన మంచు విష్ణు 
ఎన్నికల కోడ్ కేసు.. సుప్రీంకోర్టును అశ్రయించిన మంచు విష్ణు

Manchu Vishnu: ఎన్నికల కోడ్ కేసు.. సుప్రీంకోర్టును అశ్రయించిన మంచు విష్ణు 

వ్రాసిన వారు Jayachandra Akuri
May 28, 2025
03:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో తనపై నమోదైన ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసును కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ బీ.వీ. నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. విచారణ అనంతరం సంబంధిత ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను జూలై 15, 2025కి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికాకపోయినా, మంచు విష్ణుపై ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో 2019లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

Details

సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు

అయితే ఆయా ఆరోపణలు తొలగించాలని కోరుతూ మంచు విష్ణు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి విచారణలో ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు, జవాబుదారుల సమాధానాలు పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ తీర్పు దిశగా అడుగులు పడుతున్న ఈ కేసు సుప్రీంకోర్టు దాకా చేరడం సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. జూలై 15న జరిగే తదుపరి విచారణలో ఈ కేసు తుది రేఖకు చేరే అవకాశముందని అంచనాలు వేస్తున్నారు.