Loading...
Irumudi: రవితేజ 'ఇరుముడి' నుంచి ఎమోషనల్ డైలాగ్ వైరల్.. డబ్బింగ్ పనులు షురూ!
రవితేజ 'ఇరుముడి' నుంచి ఎమోషనల్ డైలాగ్ వైరల్.. డబ్బింగ్ పనులు షురూ!

Irumudi: రవితేజ 'ఇరుముడి' నుంచి ఎమోషనల్ డైలాగ్ వైరల్.. డబ్బింగ్ పనులు షురూ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 21, 2026
11:24 am

ఈ వార్తాకథనం ఏంటి

మాస్ మహారాజా రవితేజ హీరోగా, దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న 'ఇరుముడి' చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను రవితేజ ప్రారంభించారు. షూటింగ్‌లో తన భాగాన్ని ఇప్పటికే పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం స్టూడియోలో డబ్బింగ్ చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్రబృందం విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో రవితేజ చెప్పిన నాకు ఒకే ఒక్క కూతురు... ఆమె పేరు మణెమ్మ అనే డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. వీడియోలో దర్శకుడు శివ నిర్వాణ, బాలనటి నక్షత్ర కూడా కనిపించారు. సినిమాలో తండ్రీకూతుళ్ల అనుబంధం ఎంత భావోద్వేగంగా ఉండబోతోందో చిత్రబృందం హింట్ ఇచ్చింది.

వివరాలు

మూడ్రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది

ఇక సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. ఇంకా మూడు రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం.

మరోవైపు సంగీత దర్శకుడు జి.వి. ప్రకాశ్ కుమార్ కూడా రీ-రికార్డింగ్ పనులను ప్రారంభించారు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇటీవల విడుదలైన గ్లింప్స్‌లో రవితేజ తన కూతురిపై అపారమైన ప్రేమ చూపించే తండ్రిగా కనిపించారు.

అనుకోని సంఘటనల కారణంగా మద్యానికి బానిసైన వ్యక్తి.. తన కూతురు చెప్పిన మాటతో అయ్యప్ప మాల ధరించి జీవితాన్ని పూర్తిగా మార్చుకునే ప్రయాణమే ఈ కథలో ప్రధానాంశంగా ఉండనుందని తెలుస్తోంది.

వివరాలు

తండ్రీకూతుళ్ల అనుబంధమే ఈ సినిమాకు ప్రధాన బలం

రవితేజ కెరీర్‌లో 77వ చిత్రంగా తెరకెక్కుతున్న 'ఇరుముడి'లో భక్తి, భావోద్వేగాలు, కమర్షియల్ అంశాలను సమపాళ్లలో మేళవించినట్లు చిత్రబృందం చెబుతోంది.

ముఖ్యంగా తండ్రీకూతుళ్ల అనుబంధమే ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనుందని సమాచారం.

ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, బేబీ నక్షత్ర రవితేజ కూతురు పాత్రలో కనిపించనుంది.

అలాగే సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, శ్వాసిక కీలక పాత్రలు పోషిస్తున్నారు.

భిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా రవితేజ కెరీర్‌లో మరో ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందనే అంచనాలు నెలకొన్నాయి.

ADVERTISEMENT