
Kangana Ranaut: నెలసరి ఇబ్బందులు ఎంపీలకు కూడా తప్పవు: కంగనా రనౌత్
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ నటి, ప్రస్తుత ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) నెలసరి సమయంలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి ఓపెన్‌గా పంచుకున్నారు. ఈ సమస్యలు సాధారణ మహిళలకు మాత్రమే పరిమితం కావని, సెలబ్రిటీలు కూడా దీనికి మినహాయింపు కాదని ఆమె స్పష్టం చేశారు. తాను సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చాక ఈ రెండు రంగాల మధ్య ఉన్న తేడాలను, మహిళగా ఎదుర్కొనే సవాళ్లను వివరించారు. సినిమా రంగం పూర్తిగా వేరే విధంగా ఉంటుంది. షూటింగ్‌ల సమయంలో హీరోయిన్స్ కోసం ప్రత్యేక కారవాన్‌లు ఉంటాయి. అవుట్‌డోర్ షూట్‌లకైనా అవసరమైన అన్ని సౌకర్యాలు ఉంటాయి. పీరియడ్స్ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది. వాష్‌రూమ్ సదుపాయం ఉంటుంది. విశ్రాంతి కూడా తీసుకోవచ్చు.
Details
రాజకీయ రంగంలో పరిస్థితి పూర్తిగా భిన్నం
అవసరమైతే టీమ్‌ను అడిగి మినరల్ వాటర్‌ను వేడి చేసి వాడుకునే సౌకర్యం ఉంటుందని కంగనా తెలిపారు. అయితే రాజకీయ రంగంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుందని ఆమె చెప్పారు. ఒక్కోసారి పర్యటనలో భాగంగా రోజుకు 12 గంటలు కూడా ప్రయాణించాల్సి వస్తుంది. అప్పుడు కనీసం టాయిలెట్‌కు వెళ్లే సదుపాయం కూడా ఉండదు. ఇది నాకు మాత్రమే కాదు.. ఇతర ఎంపీలందరికీ ఎదురయ్యే సమస్యే. ఇది చిన్న ఇబ్బంది కాదు, పెద్ద విపత్తుతో పోల్చదగ్గదే. ఈ అనుభవాన్ని వర్ణించడం కూడా చాలా కష్టమని" కంగనా వివరించారు. 2006లో సినీరంగ ప్రవేశం చేసిన కంగనా, తన అద్భుత నటనతో ఇప్పటివరకు నాలుగు జాతీయ అవార్డులు గెలుచుకున్నారు.