చావు దెబ్బలు తిన్నా.. సునిశిత్ తగ్గట్లేదుగా.. ఈసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేతిలో బడితపూజ!
శాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్ ఇటీవల రాంచరణ్ ఫ్యాన్స్ చేతుల్లో చావు దెబ్బలు తిన్నాడు. ముఖ్యంగా సెలబ్రిటీలపై పర్సనల్ గా కామెంట్ చేయొద్దని ఏకంగా ఫ్యాన్స్ డబులిచ్చి మరీ బుద్ధి చెప్పారు. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ గురించి సునిశిత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేతిలో అతనికి బడితపూజ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనకు తాను హీరోనంటూ తెగ గొప్పలకు పోతుంటాడు సునిశిత్.. లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్నానని, తమన్నాతో డేటింగ్ చేశానని ఇలా చెప్పుకుంటూ మనోడు చెప్పే మాటలు కోకొల్లలు. సునిశిత్ ప్రవచనాలు వల్లిస్తున్నాడనుకొని పలు యూట్యూబ్ ఛానల్స్ వరుసగా ఇంటర్వ్వులూ తీసుకుంటూ అతన్ని వెలుగులోకి తీసుకొస్తున్నాయి.
సునిశిత్ కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్నింగ్
శాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్ నోటికి అడ్డుఅదుపు లేకుండా పోతోంది. తారక్ తనకు బాగా క్లోజ్ అని చెప్పిన సునిశిత్.. ఎన్టీఆర్ పోర్న్ ఫిల్మ్స్ లో నటించాడంటూ పెద్ద బాంబే పేల్చేశాడు. ఎన్టీఆర్ పోర్న్ చిత్రాలు ఉన్నాయని, తాను తప్ప ఇలాంటి విషయాలు ఎవరూ చెప్పలేరని సునిశిత్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ గురించి చెత్త వాగుడు వాగిన సునిశిత్ కు ఇప్పటికే ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నాయి. ఒక వేళ సునిశిత్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఎదరైతే చావు దెబ్బలు తినడం ఖాయంగా కనిపిస్తోంది.