Page Loader
Emergency: ఎమర్జెన్సీ సినిమాను ప్రతి భారతీయుడూ చూడాల్సిందే.. మృణాల్ పోస్ట్ వైరల్!
ఎమర్జెన్సీ సినిమాను ప్రతి భారతీయుడూ చూడాల్సిందే.. మృణాల్ పోస్ట్ వైరల్!

Emergency: ఎమర్జెన్సీ సినిమాను ప్రతి భారతీయుడూ చూడాల్సిందే.. మృణాల్ పోస్ట్ వైరల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 12, 2025
01:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'ఎమర్జెన్సీ' చిత్రం జనవరి 17న విడుదలైంది. తాజాగా ఈ సినిమాను వీక్షించిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తన అనుభవాన్ని పంచుకుంటూ కంగనాపై ప్రశంసలు కురిపించారు. తన తండ్రితో కలిసి 'ఎమర్జెన్సీ' చూశానని, ఇప్పటికీ ఆ అనుభూతి నుంచి బయటకు రావడం కష్టంగా ఉందన్నారు. కంగనా అభిమానిగా ఈ సినిమాను బిగ్‌స్క్రీన్‌పై చూడటం ఆనందంగా అనిపించిందన్నారు. ఇది ఆమె కెరీర్‌లో మరో అద్భుతమైన విజయమని, 'గ్యాంగ్‌స్టర్‌' నుంచి 'క్వీన్‌', 'తను వెడ్స్ మను' నుంచి 'మణికర్ణిక', 'తలైవి' వరకు - ఇప్పుడు 'ఎమర్జెన్సీ'తో మరో మైలురాయి చేరుకున్నారని మృణాల్ ఠాకూర్ ప్రశంసించారు.

Details

కంగనా కేవలం నటి కాదు.. నిజమైన కళాకారిణి

ఈ సినిమాలోని ప్రతి అంశం తనను ఆకట్టుకుంటోందని, కెమెరా యాంగిల్స్‌, కాస్ట్యూమ్స్‌, స్క్రీన్‌ప్లే, మాటలు, సంగీతం, ఎడిటింగ్ అన్నీ అద్భుతంగా ఉన్నాయన్నారు. కంగనా కేవలం నటి మాత్రమే కాదని, సవాలుతో కూడిన పాత్రలు పోషించే ధైర్యం ఆమెకుందన్నారు. సినిమాపై ఆమె అంకితభావం ప్రతి ఫ్రేమ్‌లో స్పష్టంగా కనిపించిందన్నారు. ఎవరైనా ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూడాలని మృణాల్ ఠాకూర్ అన్నారు. కంగనా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎమర్జెన్సీ' 1975లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాలనలో ప్రకటించిన అత్యవసర పరిస్థితిని ఆధారంగా రూపొందించారు. ఇందిరాగాంధీ పాత్రలో కంగనా, జయప్రకాశ్ నారాయణ్‌గా అనుపమ్ ఖేర్, అటల్ బిహారీ వాజ్‌పేయీగా శ్రేయాస్ తల్పడే నటించారు.