Page Loader
Venu : 'ఎల్లమ్మ' ప్రారంభానికి సర్వం సిద్ధం.. కన్‌ఫర్మ్‌ చేసిన దర్శకుడు వేణు
'ఎల్లమ్మ' ప్రారంభానికి సర్వం సిద్ధం.. కన్‌ఫర్మ్‌ చేసిన దర్శకుడు వేణు

Venu : 'ఎల్లమ్మ' ప్రారంభానికి సర్వం సిద్ధం.. కన్‌ఫర్మ్‌ చేసిన దర్శకుడు వేణు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 20, 2025
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన 'బలగం' సినిమా భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఊహించని విధంగా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందిన ఈ చిత్రం.. పల్లెటూరి ప్రజలు బస్సుల్లో జార్నీ చేస్తూ వచ్చి థియేటర్లలో చూశారంటే ఆ ప్రభావం ఎంత ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో కమెడియన్‌ వేణు దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. దీంతో అతను త్వరలోనే మరిన్ని సినిమాలు మొదలుపెడతాడన్న అంచనాలు ఏర్పడ్డాయి. వేణు గతేడాది నుంచి 'ఎల్లమ్మ' అనే సినిమాను రూపొందించాలన్న ఉద్దేశంతో కష్టపడుతున్నాడు. కథ సిద్ధం చేసిన వేణు మొదటగా ఈ స్క్రిప్ట్‌ను నేచురల్ స్టార్ నానికి వినిపించారట.

Details

ఓకే చెప్పిన నితిన్

మొదట ఆసక్తి చూపించిన నాని, ఫైనల్ వెర్షన్‌పై పూర్తిగా మెచ్చుకోలేకపోయిన కారణంగా సున్నితంగా తిరస్కరించారట. ఆ తరువాత ఇదే కథతో శర్వానంద్‌ను సంప్రదించారట కానీ ఆయన నుంచి కూడా అవే ఫలితాలు ఎదురయ్యాయని సమాచారం. తాజాగా 'హనుమాన్' ఫేమ్‌ తేజ సజ్జా కథపై ఆసక్తి చూపించినా.. ఇప్పటికే ఉన్న కమిట్‌మెంట్ల కారణంగా వెంటనే చేయలేనని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌ చివరికి నితిన్‌ వద్దకు చేరింది. కథను పూర్తిగా విన్న నితిన్‌ వెంటనే అంగీకరించాడట.

Details

స్క్రిప్ట్ బుక్‌ పట్టుకుని ఫోటో షేర్ చేసిన వేణు

త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ఒప్పందాలు కూడా పూర్తవుతాయన్న సమాచారం. ఇక ఈ క్రమంలోనే దర్శకుడు వేణు 'ఎల్లమ్మ'పై అధికారిక అప్‌డేట్‌ ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ బుక్‌ పట్టుకుని ఉన్న ఫోటోను షేర్‌ చేశారు. మొత్తంగా చూస్తే, వేణు రెండో సినిమాకి బలమైన ప్రిపరేషన్‌తో సిద్ధమవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. 'ఎల్లమ్మ' కూడా 'బలగం' తరహాలోనే ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.