NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Anant-Radhika Wedding: జూలై 12న ముంబైలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం, జూలై 14న రిసెప్షన్ 
    తదుపరి వార్తా కథనం
    Anant-Radhika Wedding: జూలై 12న ముంబైలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం, జూలై 14న రిసెప్షన్ 
    Anant-Radhika Wedding: జూలై 12న ముంబైలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం

    Anant-Radhika Wedding: జూలై 12న ముంబైలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం, జూలై 14న రిసెప్షన్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 30, 2024
    02:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత వ్యాపారవేత్త ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి , రాధికా మర్చంట్‌తో జూలై 12న వివాహం జరగనుంది.

    దేశంలోనే అతిపెద్ద వివాహ వేడుకల్లో ఇదొకటి అని చెబుతున్నారు.ఈ జంట,వారి కుటుంబాలు ఫ్రెంచ్ క్రూయిజ్‌లో ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్‌ను జరుపుకుంటున్నాయి.

    ఆహ్వానం మేరకు, ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్(BKC)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో సాంప్రదాయ హిందూ వైదిక వేడుకలో అనంత్, రాధిక వివాహం చేసుకోనున్నారు.

    శుక్రవారం, జూలై 12న వివాహ వేడుక జరగనుంది. ఆహ్వానపత్రికపై 'శుభ వివాహ' అని పేరు పెట్టారు. ఈ ఫంక్షన్‌కి సంబంధించిన డ్రెస్ కోడ్‌ను 'భారత సంప్రదాయం'గా పేర్కొన్నారు.

    దీని తరువాత, జూలై 13న 'శుభ్ ఆశీర్వాద్' వేడుక ఉంటుంది.దీనికి డ్రెస్ కోడ్ 'ఇండియన్ ఫార్మల్'గా ఉంటుంది.

    Details 

    భారీ క్రూయిజ్‌ షిప్‌ లో ప్రీవెడ్డింగ్‌ వేడుకలు

    జూలై 14న జరిగే 'మంగళ ఉత్సవ్' అంటే వివాహ రిసెప్షన్‌తో అంబానీ కుటుంబంలో సంబరాలు ముగుస్తాయి. దీనికి డ్రెస్ కోడ్ ఇండియన్ చిక్‌గా ఉంటుంది.

    తాజాగా మరోసారి వీరిద్దరి ప్రీవెడ్డింగ్‌ వేడుకలు మే 29వ తేదీన ఇటలీలో మొదలుకాగా.. జూన్‌ 1న స్విట్జర్లాండ్‌ లో ముగియనున్నాయి.

    మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకలు మొత్తం భారీ క్రూయిజ్‌ షిప్‌లోనే కొనసాగనున్నాయి.

    ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులతోపాటు బాలీవుడ్‌లోని పెద్ద స్టార్స్‌ ఆలియా భట్, రణబీర్ కపూర్,రణ్‌వీర్ సింగ్,అనన్య పాండే,సారా అలీ ఖాన్,సల్మాన్ ఖాన్‌లతో సహా పలువురు పాల్గొన్నట్లు తెలుస్తోంది.

    మొత్తం 300 మంది వీవీఐపీలు ఈ వేడుకలకు ఆహ్వానించినట్లు సమాచారం.

    Details 

    మార్చిలో ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌

    ఈ సంవత్సరం మార్చిలో వీరి ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ కూడా అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.

    గుజరాత్‌ జామ్‌ నగర్‌లో జరిగిన ఈ వేడుకలకు దేశ, అంతర్జాతీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు.

    Embed

    అనంత్ అంబానీ,రాధికా మర్చంట్‌ వివాహా పత్రిక ఇదే.. 

    Anant Ambani and Radhika's Wedding to be held in Mumbai on 12th July at the Jio World Convention Centre in BKC. Wedding to be performed in accordance with the traditional Hindu Vedic way. The main wedding ceremonies will start on Friday, 12th July with the auspicious Shubh... pic.twitter.com/YKnaAIAs7o— ANI (@ANI) May 30, 2024

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అనంత్ అంబానీ
    ముకేష్ అంబానీ

    తాజా

    RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు విరాట్ కోహ్లీ
    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్

    అనంత్ అంబానీ

    Gautam Singhania: 'అంబానీనే కాపాడారు'.. గౌతమ్ సింఘానియా భార్య సంచలన ఆరోపణలు వ్యాపారం
    Anant Ambani: ప్రీ వెడ్డింగ్ వేడుకలను అందుకే జామ్‌నగర్‌లో జరుపుకుంటున్నా: అనంత్ అంబానీ  గుజరాత్
    Anant ambani: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్.. దాండియా ఆడిన ధోని- బ్రావో  ముకేష్ అంబానీ
    Ram Charan : రామ్ చరణ్‌తో 'నాటు నాటు' పాటకు స్టెప్పులేసిన సల్మాన్, షారూఖ్, అమీర్  రామ్ చరణ్

    ముకేష్ అంబానీ

    ప్రపంచ బిలియనీర్ల జాబితా టాప్ 20లో స్థానం కోల్పోయిన గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ
    అశోక్ లేలాండ్ తో కలిపి RIL ఆవిష్కరించిన హైడ్రోజన్-శక్తితో నడిచే భారీ-డ్యూటీ ట్రక్కు ఆటో మొబైల్
    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు ఆంధ్రప్రదేశ్
    Andhra pradesh: రిలయన్స్ పెట్టుబడులతో 50వేల మందికి ఉద్యోగావకాశాలు: ముఖేష్ అంబానీ ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025