Page Loader
Sandhya Theater Stampede: తప్పుడు ప్రచారాలు కఠిన చర్యలు.. సంధ్య థియేటర్‌ ఘటనపై పోలీసులు హెచ్చరిక
తప్పుడు ప్రచారాలు కఠిన చర్యలు.. సంధ్య థియేటర్‌ ఘటనపై పోలీసులు హెచ్చరిక

Sandhya Theater Stampede: తప్పుడు ప్రచారాలు కఠిన చర్యలు.. సంధ్య థియేటర్‌ ఘటనపై పోలీసులు హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 25, 2024
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై తప్పుడు పోస్టులు పెట్టొద్దని పోలీసులు హెచ్చరించారు. సోషల్‌ మీడియా వేదికపై తప్పుడు సమాచారం లేదా ప్రజలను అపోహలకు గురి చేసే వీడియోలు పంపితే కఠిన చర్యలు తప్పవన్నారు. అల్లు అర్జున్‌ రాకముందే తొక్కిసలాట జరిగిందని కొందరు పోస్టు చేసిన తప్పుడు వీడియోలు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుండగా, నిజాలను వీడియో రూపంలో ప్రజలకు పోలీసులు ఇప్పటికే అందించారు. కానీ కొందరు అర్జున్‌ రాకముందే తొక్కిసలాట జరిగినట్లు తప్పుడు ప్రచారం చేసే వీడియోలు సోష‌ల్ మీడియాలో పోస్టు చేసిన విషయం పోలీసుల దృష్టికి వచ్చింది.

Details

అసత్య ప్రచారాలు తప్పుడు చర్యలు

కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఇలాంటి ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసులో ఓ అమాయకురాలు మరణించగా, ఓ పిల్లవాడి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడింది. పోలీసులు ఎంతో నిబద్ధతతో విచారణ చేస్తుండగా, అసత్య ప్రచారాలు చేయడాన్ని వారు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఎవరైనా ఆధారాలు లేదా అదనపు సమాచారం ఉంటే పోలీసులకు అందించవచ్చని, కానీ సొంత వ్యాఖ్యానాలు చేయవద్దని వారు ప్రజలను కోరారు. సోషల్‌ మీడియా వేదికపై జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మకూడదని, ప్రజలు అపోహలు పుట్టించే పోస్టులు పంచకూడదని హైదరాబాద్‌ సిటీ పోలీసులు విజ్ఞప్తి చేశారు.