LOADING...
Singer Mangli : నా పరువును దెబ్బతీయడానికే అసత్య ప్రచారం.. మంగ్లీ సంచలన వ్యాఖ్యలు
నా పరువును దెబ్బతీయడానికే అసత్య ప్రచారం.. మంగ్లీ సంచలన వ్యాఖ్యలు

Singer Mangli : నా పరువును దెబ్బతీయడానికే అసత్య ప్రచారం.. మంగ్లీ సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 11, 2026
05:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినీ గాయని మంగ్లీ చుట్టూ నెలకొన్న ఆర్థిక వివాదం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. మైక్రో ఫైనాన్స్ పేరుతో సుమారు పది కోట్ల రూపాయల మేర మోసం జరిగిందంటూ న్యాయవాది సుబ్బారావు చేసిన ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. తనపై కావాలనే అసత్య ప్రచారం చేసి ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని మంగ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాయర్ సుబ్బారావు ఫిర్యాదు చేయడానికి ముందే తానే నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఫిర్యాదు చేసినట్లు మంగ్లీ వెల్లడించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నోట్ల కట్టల దృశ్యాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ డబ్బు తనదే కాదని ఆమె స్పష్టం చేశారు.

వివరాలు

చట్టపరంగా పోరాడతా

ఒక మహిళగా, కళాకారిణిగా తన గుర్తింపును దెబ్బతీసేలా కుట్ర జరుగుతోందని, దీనిపై చట్టపరంగా పోరాడతానని మంగ్లీ హెచ్చరించారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆమె ప్రజలను కోరారు. ఇక పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో మంగ్లీ, ఆమె సోదరుడు సహా మరికొందరిపై న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వారి నుంచి ప్రాణహాని ఉందని ఆయన పేర్కొనడంతో పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఆరోపణలకు మంగ్లీ ఎదురుదాడి చేయడంతో ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Advertisement