LOADING...
Asha Bhosle: ప్రముఖ గాయని ఆశా భోంస్లే కన్నుమూత 
ప్రముఖ గాయని ఆశా భోంస్లే కన్నుమూత.. అభిమానుల్లో విషాదం

Asha Bhosle: ప్రముఖ గాయని ఆశా భోంస్లే కన్నుమూత 

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 12, 2026
12:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ సంగీత ప్రపంచంలో ఒక మహత్తర స్వర యుగానికి తెరపడింది. దిగ్గజ గాయని, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత Asha Bhosle (92) ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. శనివారం సాయంత్రం తీవ్ర అలసటతో పాటు ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో ఆమెను చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. మొదట ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వార్తలు వచ్చినప్పటికీ, ఆదివారం మధ్యాహ్నం ఆమె కుమారుడు ఆనంద్ భోంస్లే ఈ మరణవార్తను అధికారికంగా ధృవీకరించారు.

వివరాలు

20పైగా భాషల్లో వేలాది పాటలు పాడిన అనుభవం

దాదాపు ఎనిమిది దశాబ్దాల పాటు 20కి పైగా భాషల్లో వేలాది పాటలు ఆలపించి కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ఆమె మరణంతో బాలీవుడ్ సహా భారతీయ సినీ సంగీత రంగం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, భారతరత్న లతా మంగేష్కర్ సోదరిగా కూడా ప్రసిద్ధి చెందిన ఆశా భోంస్లే అంతిమ సంస్కారాలు సోమవారం ముంబైలోని శివాజీ పార్క్‌లో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఆమె మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ, భారతీయ సంగీత ప్రపంచం ఒక ధ్రువతారను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement