Page Loader
Parvati Nair : వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ప్రముఖ తెలుగు నటి
వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ప్రముఖ తెలుగు నటి

Parvati Nair : వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ప్రముఖ తెలుగు నటి

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 13, 2025
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల కాలంలో సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని కుటుంబ జీవితం ప్రారంభించడం సాధారణమైపోయింది. ఇది తెలుగు, తమిళ సినీ పరిశ్రమలకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా అన్ని చిత్రసీమల్లో కనిపించే పరిణామంగా మారింది. ఒకప్పుడు సినీ కెరీర్‌ దెబ్బతింటుందని భావించి హీరోయిన్లు పెళ్లిని వాయిదా వేసేవారు. కానీ ఈ తరం నటీమణులు పెళ్లి చేసుకుని కెరీర్‌ను కొనసాగించడంలో ఆసక్తి చూపిస్తున్నారు. ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునే సెలబ్రిటీలు కూడా పెరుగుతున్నారు. తాజాగా దక్షిణాది యంగ్‌ బ్యూటీ పార్వతి నాయర్‌ కూడా పెళ్లి బంధంలో అడుగుపెట్టింది.

Details

30 సినిమాలకు పైగా నటించిన పార్వతి నాయర్

తక్కువ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న పార్వతి, టాలీవుడ్ లో నేచురల్‌ స్టార్‌ నాని సరసన 'జెండాపై కపిరాజు' సినిమాలో నటించి మెప్పించింది. అనంతరం తమిళం, మలయాళం భాషల్లో 30కి పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఇటీవల పార్వతి నాయర్‌, ప్రముఖ వ్యాపారవేత్త అశ్రిత్‌తో ప్రేమలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట, పెద్దలను ఒప్పించి నిశ్చితార్థం జరుపుకుంది. ఇక తాజాగా కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని పార్వతి స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.