Page Loader
NTR : ఎన్టీఆర్ ఎంట్రీతో పండుగ వాతావరణం.. ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్‌లోకి ఎంట్రీ!
ఎన్టీఆర్ ఎంట్రీతో పండుగ వాతావరణం.. ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్‌లోకి ఎంట్రీ!

NTR : ఎన్టీఆర్ ఎంట్రీతో పండుగ వాతావరణం.. ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్‌లోకి ఎంట్రీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 21, 2025
02:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ఎన్టీఆర్, ఆ తర్వాత 'దేవర' సినిమాతో మరింత క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ఇప్పుడు 'దేవర' తర్వాత ఆయన ఏ దర్శకుడితో సినిమా చేస్తారు? షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుంది? అనే ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు వస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ తన కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి కర్ణాటకకు వెళ్లారు. ఈ షూటింగ్ ఏప్రిల్ 22న నుంచి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని ఎయిర్‌పోర్టులో తన నిర్మాతలతో కలిసి కనిపించిన ఎన్టీఆర్‌ను అక్కడే మీడియా కెమెరాలు క్యాప్చర్ చేశాయి. ఈ సందర్భంలో ఎన్టీఆర్ లుక్‌కి విశేష స్పందన లభిస్తోంది.

Details

స్టైలిష్‌ లుక్ లో ఎన్టీఆర్

గతంలో ఎన్నడూ చూడని విధంగా ఆయన చాలా సన్నగా, స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. జాకెట్‌లా ఉన్న స్టైలిష్ షర్ట్, స్టైలిష్ గోగుల్స్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి భారీ అంచనాలేర్పడ్డాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైన ఈ చిత్రీకరణ ఇప్పుడు కర్ణాటకలో కొనసాగనుంది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌ను కొత్త మాస్ అవతార్‌లో చూపించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు సమాచారం. 'మారణహోమానికి ముందు ప్రశాంతత' అంటూ చిత్రయూనిట్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్న సమయంలో ఈ వీడియోను పోస్ట్ చేయడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.