
HHVM : వీరమల్లులో ఫైట్ సీన్.. 60 రోజులు కష్టపడ్డ పవన్ కళ్యాణ్!
ఈ వార్తాకథనం ఏంటి
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'హరిహర వీరమల్లు' థియేటర్లలోకి రావడానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలుండటంతో చిత్రబృందం ప్రమోషన్లు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు జ్యోతికృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఈ ముగ్గురు కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో దర్శకుడు జ్యోతికృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'హరిహర వీరమల్లులో పవన్ కల్యాణ్ ఒకదాని తర్వాత ఒకటిగా విభిన్న గెటప్పుల్లో కనిపిస్తారు. ఇంతవరకూ ఆయన చేయని ఫైట్స్ ఈ సినిమాలో కనిపిస్తాయి.
Details
ఫైట్ సీన్ చూస్తే గూస్ బంప్స్ గ్యారంటీ
ప్రతి యాక్షన్ సీన్ ఒకదానికొకటి డిఫరెంట్‌గా ఉంటుంది. వాటిలో ఓ స్పెషల్ ఫైట్ సీన్ పవన్‌కే ప్రత్యేకంగా డిజైన్ చేశాం. అది చిత్రానికి హైలైట్‌గా నిలవనుందని తెలిపారు. ఆ ఫైట్ సీన్ గురించి మాట్లాడుతూ. దాన్ని తెరకెక్కించడానికి ఏకంగా 60 రోజులు పట్టింది. ప్రతి రోజు పవన్ కల్యాణ్ ఎంతో కష్టపడ్డారు. అతని అంకితభావం అద్భుతం. ఆ సీన్ చూస్తే ప్రేక్షకులకు గూస్‌బంప్స్ వస్తాయి. థియేటర్‌లో పవన్‌ను ఆ తరహా యాక్షన్‌లో చూడటమే ఓ అనుభూతి. చారిత్రాత్మక ఫైట్స్ తలపించేలా తీర్చిదిద్దాం.
Details
జూలై 24న రిలీజ్
ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ చేసిన యాక్షన్ సీన్ల కంటే ఇది మేటినని వివరించారు జ్యోతికృష్ణ. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పవన్ అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అంతకుముందుగా రేపు (జూలై 21) భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.