
Avatar 3: ఫైర్ అండ్ యాష్.. అద్భుత విజువల్స్‌తో వదిలిన అవతార్ 3 ట్రైలర్!
ఈ వార్తాకథనం ఏంటి
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ 'అవతార్ 3' కోసం ప్రేక్షకులు అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే తొలి రెండు భాగాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించాయి. అందుకే మూడో భాగం కూడా అదే స్థాయిలో అద్భుతమైన విజయం సాధిస్తుందన్న నమ్మకం ప్రేక్షకుల్లో నెలకొంది. 'అవతార్:ఫైర్ అండ్ యాష్' అనే టైటిల్‌తో ఈ మూడో భాగం డిసెంబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు జేమ్స్ కామెరూన్ తనదైన శైలిలో గ్రాఫిక్స్,విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను మరోసారి మాయ లోకంలోకి తీసుకెళ్లాడు. కొత్త అగ్ని నెవీ తెగలు, పాండోరా చంద్రునిపై మళ్లీ మానవ ముప్పు, కొత్త ఎమోషనల్ కోణాలు ఆకట్టుకునేలా చూపించారు.
Details
ట్రైలర్ కు అద్భుత రెస్పాన్స్
కొద్దీ రోజుల క్రితం చిత్రబృందం విలన్ పాత్రగా పరిచయం కాబోతున్న 'వరంగ్' ఫస్ట్‌లుక్ విడుదల చేసింది. అగ్ని శక్తులు కలిగిన నెవీ తెగకు చెందిన వరంగ్ పాత్ర చాలా గంభీరంగా, రహస్యంగా ఉండబోతుందన్న భావన కలిగిస్తోంది. ఆ ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన రావడంతో, ఇప్పుడు ట్రైలర్‌కు కూడా అద్భుత రెస్పాన్స్ వస్తోంది. దర్శకుడు కామెరూన్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ భాగంలో కొత్త విట్లరన్లు తెరపైకి రానున్నారు. ఇప్పటివరకు జేక్ ఫ్యామిలీ భూమి నుంచి వచ్చిన మానవులతో రెండు సార్లు పోరాడింది. కానీ ఈసారి 'యాష్ వరల్డ్' లోని తెగలతో తలపడే పరిస్థితులు ఏర్పడతాయి. పాండోరాలోని వివిధ తెగల జీవనశైలులు, వాటి మధ్య విభేదాలు, అభిప్రాయ భేదాలు ఈ కథలో ప్రధానాంశంగా ఉండనున్నాయి.