LOADING...
James Cameron : అవతార్- 3 ఫస్ట్ లుక్ విడుదల.. ట్రైలర్ తేదీ ఇదే 
అవతార్- 3 ఫస్ట్ లుక్ విడుదల.. ట్రైలర్ తేదీ ఇదే

James Cameron : అవతార్- 3 ఫస్ట్ లుక్ విడుదల.. ట్రైలర్ తేదీ ఇదే 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 22, 2025
08:39 am

ఈ వార్తాకథనం ఏంటి

జేమ్స్ కెమెరూన్ సినిమాలు హాలీవుడ్ లోనే కాదు, భారతీయ సినిమా రంగంలో కూడా భారీ కలెక్షన్లు రాబడతాయి. టెర్మినేటర్, టైటానిక్, అవతార్ వంటి సినిమాలతో ఆయన భారత బాక్సాఫీస్‌ ను కుదిపేశాడు. జేమ్స్ కెమెరూన్ సినిమా వస్తుందంటే దేశంలోని ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా దుకాణం సర్దుకోవాల్సిందే ఇది ఆయనకు ఉన్న క్రేజ్ ను సూచిస్తుంది. అవతార్ తర్వాత అవతార్ 2 తీసేందుకు ఆయన 13 సంవత్సరాలు తీసుకున్నప్పటికీ, ఆ సినిమా ప్రేక్షకులను నిరాశపర్చలేదు. అవతార్: ద వే ఆఫ్ వాటర్ మూవీ భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పటివరకు అవతార్ ఫ్రాంఛైజీ నుంచి రెండు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మూడో భాగం విడుదలకు సిద్ధమవుతోంది.

వివరాలు 

'ఫెంటాస్టిక్ ఫోర్' చిత్రంతో కలిపి ఈ ట్రైలర్‌ విడుదల 

గత రెండు సినిమాల మాదిరిగానే, అవతార్ 3ను కూడా ఈ ఏడాది డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. జేమ్స్ కెమెరూన్ ఈసారి ప్రేక్షకులకు ఇప్పటివరకు చూడని పండోరా ప్రపంచాన్ని చూపించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ట్రైలర్‌ను వచ్చే రెండు రోజుల్లో రిలీజ్ చేయనున్నారు. హాలీవుడ్ లో మరో భారీ బడ్జెట్ మూవీ అయిన మార్వెల్ 'ఫెంటాస్టిక్ ఫోర్' చిత్రంతో కలిపి ఈ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

వివరాలు 

2029లో అవతార్ 4 

ఈ అవతార్ సినిమా ఫ్రాంఛైజీకి మరో రెండు సీక్వెల్స్ కూడా రూపొందించబోతున్నారు. అవతార్ 4ను 2029లో, అవతార్ 5ను 2031లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. పంచభూతాల కాన్సెప్ట్‌తో జేమ్స్ కెమెరూన్ ఈ సినిమాలను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. మొదటి సినిమాతో నేలను, రెండవ సినిమాలో నీటిని చూపించగా, ఇప్పుడు మూడవ భాగంలో 'నిప్పు' ఆధారంగా కథ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా భారీ హైప్ క్రియేట్ చేస్తున్న అవతార్ 3 క్రిస్మస్ సీజన్‌లో విడుదలకానుండటంతో, డిసెంబర్ 15 తర్వాత విడుదలయ్యే భారతీయ సినిమాలు తమ రిలీజ్ తేదీలను మార్చుకోవాల్సిన పరిస్థితి తప్పదు.