Page Loader
Prabhas: ప్రభాస్ 'కల్కి' నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ 
ప్రభాస్ 'కల్కి' నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్

Prabhas: ప్రభాస్ 'కల్కి' నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 24, 2023
11:01 am

ఈ వార్తాకథనం ఏంటి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'కల్కి2898ఏడీ' సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్‌గా ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నారు. ఇందులో లోక నాయకుడు కమల హాసన్ నెగటివ్ రోల్‌లో నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. నిన్న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఏమైనా అప్డేట్ వస్తుందేమోనని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ అలాంటి మేజర్ అప్డేట్ ఇవ్వలేదు. కానీ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ని మాత్రం మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్‌ లుక్‌ బ్లాక్‌ షేడ్‌లో ఉంది. దాంట్లో మరో ప్రపంచం కనిపిస్తుంది. భవిష్యత్‌ 2898ఏడాది సమయంలో మన ప్రపంచం ఎలా ఉండబోతుందనేది అందులో ఆవిష్కరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కల్కి నుంచి విడుదలైన పోస్టర్