Hari Hara Veera Mallu :'హరిహర వీరమల్లు' నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో.. పవన్ కళ్యాణ్ వాయిస్ హైలైట్
ఈ వార్తాకథనం ఏంటి
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి.
ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సగభాగం వరకు తెరకెక్కించగా, మిగతా భాగాన్ని జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి తొలి పాట 'మాట వినాలి' ప్రోమోను విడుదల చేశారు.
పాటను పూర్తి రూపంలో విడుదల చేయకముందే, 'వినాలి... వీరమల్లు మాట చెబితే వినాలి' అని పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్‌ను చిత్రబృందం ప్రేక్షకుల ముందుంచింది.
మాట వినాలి పూర్తి పాటను జనవరి 17న ఉదయం 10 గంటల 20 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ పాటను స్వయంగా పవన్ కళ్యాణ్ పాడటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
Details
మార్చి 28న రిలీజ్
. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సూర్య మూవీస్ బ్యానర్‌పై ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.
ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. చిత్రబృందం ఇప్పటికే దీనిని ప్రకటించగా, తొలి భాగం 'హరిహర వీరమల్లు - 1: ది స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' అనే టైటిల్‌తో వస్తోంది.
ఈ భాగాన్ని ఈ ఏడాది మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినిమా ప్రేమికులందరూ ఈ చిత్రాన్ని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.