Tamannah: 'వీవాన్'లో ప్రత్యేక పాటతో అలరించనున్న తమన్నా
ఈ వార్తాకథనం ఏంటి
మహిళా ప్రాధాన్యత కథలతో పాటు ప్రత్యేక పాటల్లోనూ కనిపిస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న కథానాయిక తమన్నా భాటియా ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి వీవాన్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ అనేది ఈ సినిమాకు ఉపశీర్షిక. ఈ చిత్రానికి దీపక్ మిశ్రా, అరుణభ్ కుమార్‌లు దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
వివరాలు
భారతీయ పురాణాలు, జానపద కథల ప్రేరణతో..
ప్రస్తుతం షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఓ జానపద గీతాన్ని చిత్రీకరించేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఆ పాటలో తమన్నా, సిద్ధార్థ్‌ల స్టెప్పులు అభిమానులను ఆకట్టుకునేలా ఉండనున్నాయని టాక్. అలాగే త్వరలోనే ముంబయిలో ఈ పాట షూటింగ్ ప్రారంభం కానుందనే చర్చ బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. భారతీయ పురాణాలు, జానపద కథల ప్రేరణతో ఈ చిత్రాన్ని రూపుదిద్దుతున్నట్లు తెలుస్తోంది.