Rashmika Mandanna: రష్మిక డీప్ ఫేక్ వీడియో కేసులో నలుగురు అరెస్టు
కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సినీతారలు డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) వీడియో పెద్ద దుమారమే రేపింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ సాయంతో రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి చేసి వీడియోను సోషల్ మీడియాలో వదిలారు. రష్మిక తర్వాత అలియా భట్, కత్రీనా కైఫ్ లాంటి హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోస్ సైతం వైరల్ అయ్యాయి. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు డిమాండ్ చేశారు.
వీడియో సృష్టికర్తల కోసం గాలింపు
రష్మిక ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ఈ క్రమంలో నలుగురిని దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ నలుగురు ఈ వీడియోను అప్ లోడ్ చేసినట్టు గుర్తించారు. అయితే నకిలీ వీడియోను తయారు చేసింది మాత్రం వారు కాదని, వీడియోను సృష్టించిన వారి కోసం వెతుకుతున్నట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.