Loading...
Bigg Boss: సల్మాన్‌ నుంచి నాగ్‌ వరకు.. బిగ్‌బాస్‌ హోస్ట్‌ల ఫీజులు తెలిస్తే షాకే!
సల్మాన్‌ నుంచి నాగ్‌ వరకు.. బిగ్‌బాస్‌ హోస్ట్‌ల ఫీజులు తెలిస్తే షాకే!

Bigg Boss: సల్మాన్‌ నుంచి నాగ్‌ వరకు.. బిగ్‌బాస్‌ హోస్ట్‌ల ఫీజులు తెలిస్తే షాకే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 07, 2026
12:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో 'బిగ్‌ బాస్‌' ఒకటి. తొలుత హిందీలో ప్రారంభమైన ఈ కార్యక్రమం.. ఆ తర్వాత పలు భారతీయ భాషలకు విస్తరించి భారీ వాణిజ్య విజయాన్ని సాధించింది. ఈ షోకు ఉన్న క్రేజ్‌కు ప్రధాన కారణాల్లో హోస్ట్‌ల స్టార్‌డమ్‌ కూడా ఒకటి. అగ్రతారలు హోస్ట్‌లుగా వ్యవహరిస్తుండటంతో.. వారి స్థాయికి తగ్గట్టుగానే నిర్వాహకులు భారీ మొత్తంలో పారితోషికాలు చెల్లిస్తున్నట్లు పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

వివరాలు

సల్మాన్‌ ఖాన్‌.. టాప్‌లో!

హిందీ బిగ్‌బాస్‌కు సీజన్‌ 4 నుంచి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌.. అత్యధిక పారితోషికం అందుకుంటున్న హోస్ట్‌ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.

'వెరైటీ ఇండియా' కథనం ప్రకారం.. ఆయన ఒక పూర్తి సీజన్‌కు దాదాపు రూ.200 కోట్లు అందుకుంటున్నట్లు సమాచారం.

వారాంతపు ఎపిసోడ్‌కు రూ.15 కోట్లకు పైగా తీసుకుంటున్నారని కూడా ప్రచారం జరుగుతోంది.

మరో నివేదిక ప్రకారం.. బిగ్‌బాస్‌ 20వ సీజన్‌ కోసం సల్మాన్‌ ఖాన్‌ దాదాపు రూ.120 కోట్ల ప్యాకేజీ అందుకున్నట్లు అంచనా.

అయితే ఈ పారితోషిక వివరాలను నిర్వాహకులు గానీ, సల్మాన్‌ ఖాన్‌ గానీ అధికారికంగా ధ్రువీకరించలేదు.

వివరాలు

సౌరవ్‌ గంగూలీకి రూ.125 కోట్లకు పైగా?

బెంగాలీ బిగ్‌బాస్‌ సీజన్‌ 3కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న భారత మాజీ క్రికెట్‌ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ కూడా భారీ పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఆయన ప్యాకేజీ రూ.125 కోట్లకు పైగా ఉంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి.

క్రికెట్‌ వంటి క్రీడా రంగానికి చెందిన ప్రముఖుడిని హోస్ట్‌గా తీసుకురావడం బెంగాలీ బిగ్‌బాస్‌కు అదనపు ఆకర్షణను తీసుకొచ్చింది.

ADVERTISEMENT

వివరాలు

తమిళంలో విజయ్‌ సేతుపతి

తమిళ బిగ్‌బాస్‌లో కమల్‌ హాసన్‌ తర్వాత హోస్ట్‌గా బాధ్యతలు చేపట్టిన నటుడు విజయ్‌ సేతుపతి కూడా భారీగానే పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆయన ఒక్కో వారాంతపు ఎపిసోడ్‌కు రూ.3-4 కోట్లు అందుకుంటున్నారని సమాచారం.

దీంతో ఒక సీజన్‌కు ఆయన సంపాదన సుమారు రూ.75-80 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

ADVERTISEMENT

వివరాలు

తెలుగులో నాగార్జున రెమ్యునరేషన్‌ పెంపు

తెలుగు బిగ్‌బాస్‌ విషయానికొస్తే.. కింగ్‌ నాగార్జున పారితోషికం కూడా గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది.

2019లో హోస్ట్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన సమయంలో ఆయనకు సుమారు రూ.10 కోట్లు చెల్లించినట్లు సమాచారం.

అయితే ఇటీవలి సీజన్లలో ఆయన రెమ్యునరేషన్‌ దాదాపు రూ.35 కోట్లకు చేరినట్లు ప్రచారం జరుగుతోంది.

మోహన్‌లాల్‌, సుదీప్‌కి ఎంతంటే?

మలయాళ బిగ్‌బాస్‌కు చాలా కాలంగా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న మోహన్‌లాల్‌కు ఒక్కో సీజన్‌కు సుమారు రూ.30 కోట్లు చెల్లిస్తున్నట్లు సమాచారం.

కన్నడ బిగ్‌బాస్‌ హోస్ట్‌ కిచ్చా సుదీప్‌కు సీజన్‌కు దాదాపు రూ.20 కోట్లు అందుతున్నట్లు తెలుస్తోంది.

అంటే ఒక్కో వారాంతపు ఎపిసోడ్‌కు ఆయన సుమారు రూ.2 కోట్లు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వివరాలు

ఆరు భాషల్లో.. 95కు పైగా స్పాన్సర్లు

ప్రస్తుతం జియోస్టార్‌ వేదికగా హిందీ, బెంగాలీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి ఆరు బిగ్‌బాస్‌ ఎడిషన్లు ప్రసారమవుతున్నాయి.

ఈ సీజన్‌లో వివిధ రంగాలకు చెందిన 95కు పైగా స్పాన్సర్లు షోతో భాగస్వామ్యం కావడం.. బిగ్‌బాస్‌కు ఉన్న భారీ వాణిజ్య విలువను స్పష్టం చేస్తోంది.

బనిజయ్‌ ఆసియా, ఎండెమోల్‌ షైన్‌ ఇండియా సంయుక్తంగా ఈ షోను నిర్మిస్తున్నాయి. హోస్ట్‌ల స్టార్‌ పవర్‌, ప్రాంతీయ స్థాయిలో ఉన్న ఆదరణతో బిగ్‌బాస్‌ ఫ్రాంచైజ్‌ దేశంలోని అతిపెద్ద వాణిజ్య ఆస్తుల్లో ఒకటిగా మారింది.

అయితే బిగ్‌బాస్‌ హోస్ట్‌లకు సంబంధించిన పైన పేర్కొన్న పారితోషికాలన్నీ మీడియా నివేదికలు, అంచనాల ఆధారంగా వచ్చినవే.

వీటిపై నిర్వాహకులు లేదా సంబంధిత హోస్ట్‌ల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదనే విషయాన్ని గమనించాలి.

ADVERTISEMENT