LOADING...
Niharika Konidela: విమర్శలకు ఫుల్ స్టాప్..వారిని పట్టించుకోవడం మానేశా : నిహారిక
విమర్శలకు ఫుల్ స్టాప్..వారిని పట్టించుకోవడం మానేశా : నిహారిక

Niharika Konidela: విమర్శలకు ఫుల్ స్టాప్..వారిని పట్టించుకోవడం మానేశా : నిహారిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 31, 2026
10:05 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' బ్యానర్‌పై సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన 'రాకాస' సినిమాను నిర్మించారు. మానస శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నిహారిక తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగా స్పందించారు. నిర్మాతగా తన ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి అనేక విమర్శలు ఎదురవుతున్నాయని నిహారిక వెల్లడించారు. "నేను ఏం చేసినా విమర్శించే వాళ్లు ఉంటూనే ఉంటారు. 'కమిటీ కుర్రోళ్లు' సినిమాతో 11మంది కొత్తవారిని పరిచయం చేసినప్పుడు కూడా ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు? తెలిసిన వారితో సినిమాలు చేయొచ్చుకదా అన్నారు.

వివరాలు

నిరంతరం నేర్చుకుంటూనే ఉంటా

ఇప్పుడు 'రాకాస' వంటి హై-వోల్టేజ్ వీఎఫ్‌ఎక్స్ మూవీ తీస్తుంటే, మళ్లీ చిన్న కథలే చేయొచ్చని సలహాలు ఇస్తున్నారు. నేను ఏం చేసినా మాటలు అనేవాళ్లు ఉంటారు, అందుకే ఇప్పుడు వాళ్లను పట్టించుకోవడం మానేశానని స్పష్టం చేశారు. నిర్మాతగా ప్రతి సినిమా తనకు ఒక కొత్త పాఠమని, నిరంతరం నేర్చుకుంటూనే ఉంటానని ఆమె చెప్పారు. "నాకు కొణిదెల కుటుంబం ఎంత ముఖ్యమో, నా 'పింక్ ఎలిఫెంట్' టీమ్ కూడా అంతే ముఖ్యమైంది. నేను నమ్మినదే చేస్తాను, నా ప్రయాణం అలాగే కొనసాగుతుందంటూ నిహారిక ధైర్యంగా పేర్కొన్నారు.

Advertisement