Loading...
Giribabu: ముగిసిన నటుడు గిరిబాబు అంత్యక్రియలు.. తండ్రికి తలకొరివి పెట్టిన రఘుబాబు
ముగిసిన నటుడు గిరిబాబు అంత్యక్రియలు.. తండ్రికి తలకొరివి పెట్టిన రఘుబాబు

Giribabu: ముగిసిన నటుడు గిరిబాబు అంత్యక్రియలు.. తండ్రికి తలకొరివి పెట్టిన రఘుబాబు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 15, 2026
05:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ నటుడు గిరిబాబు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం ప్రకాశం జిల్లా రావినూతలలో బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. గ్రామంలోని ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది. ఈ యాత్రలో గ్రామస్థులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నటుడు రఘుబాబు తన తండ్రి గిరిబాబు చితికి తలకొరివి పెట్టారు. దీంతో అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. అంతకుముందు పలువురు సినీ ప్రముఖులు గిరిబాబు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

ADVERTISEMENT