Page Loader
Gaddar film awards: గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2014-2023.. ఏఏ సినిమాలు ఉత్తమ చిత్రాలుగా నిలిచాయో తెలుసా?
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2014-2023.. ఏఏ సినిమాలు ఉత్తమ చిత్రాలుగా నిలిచాయో తెలుసా?

Gaddar film awards: గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2014-2023.. ఏఏ సినిమాలు ఉత్తమ చిత్రాలుగా నిలిచాయో తెలుసా?

వ్రాసిన వారు Jayachandra Akuri
May 30, 2025
03:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ అవార్డులు ఎంపికపై ప్రముఖ సినీ నటుడు, అవార్డు జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కూడా పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడిన వారు, 2014 జూన్ 2 నుంచి 2023 వరకు విడుదలైన చిత్రాలను పరిగణనలోకి తీసుకొని గద్దర్ అవార్డులను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రతేడాది మూడు ఉత్తమ సినిమాలను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. అలాగే, సినీ రంగానికి విశేష సేవలందించిన ప్రముఖులకు ఆరు ప్రత్యేక అవార్డులు ఇవ్వనున్నట్లు కూడా తెలిపారు. ప్రజాకవి, దివంగత కాళోజీకి స్పెషల్ జ్యూరీ అవార్డు ప్రకటించారు.

Details

వివిధ సంవత్సరాల్లో ఉత్తమ చిత్రాలు 

2014 ప్రథమ ఉత్తమ చిత్రం: రన్ రాజా రన్ రెండో ఉత్తమ చిత్రం: పాఠశాల మూడో ఉత్తమ చిత్రం: అల్లుడు శీను 2015 ప్రథమ ఉత్తమ చిత్రం: రుద్రమదేవి రెండో ఉత్తమ చిత్రం: కంచె మూడో ఉత్తమ చిత్రం: శ్రీమంతుడు 2016 ప్రథమ ఉత్తమ చిత్రం: శతమానం భవతి రెండో ఉత్తమ చిత్రం: పెళ్లి చూపులు మూడో ఉత్తమ చిత్రం: జనతా గ్యారేజ్ 2017 ప్రథమ ఉత్తమ చిత్రం: బాహుబలి 2 రెండో ఉత్తమ చిత్రం: ఫిదా మూడో ఉత్తమ చిత్రం: ఘాజీ

Details

2018 

ప్రథమ ఉత్తమ చిత్రం: మహానటి రెండో ఉత్తమ చిత్రం: రంగస్థలం మూడో ఉత్తమ చిత్రం: కేరాఫ్ కంచరపాలెం 2019 ప్రథమ ఉత్తమ చిత్రం: మహర్షి రెండో ఉత్తమ చిత్రం: జెర్సీ మూడో ఉత్తమ చిత్రం: మల్లేశం 2020 ప్రథమ ఉత్తమ చిత్రం: అల వైకుంఠపురములో రెండో ఉత్తమ చిత్రం: కలర్ ఫొటో మూడో ఉత్తమ చిత్రం: మిడిల్ క్లాస్ మెలొడీస్ 2021 ప్రథమ ఉత్తమ చిత్రం: ఆర్‌ఆర్‌ఆర్ రెండో ఉత్తమ చిత్రం: అఖండ మూడో ఉత్తమ చిత్రం: ఉప్పెన 2022 ప్రథమ ఉత్తమ చిత్రం: సీతారామం రెండో ఉత్తమ చిత్రం: కార్తికేయ 2 మూడో ఉత్తమ చిత్రం: మేజర్

Details

2023 

ప్రథమ ఉత్తమ చిత్రం: బలగం రెండో ఉత్తమ చిత్రం: హనుమాన్ మూడో ఉత్తమ చిత్రం: భగవంత్ కేసరి ఆరు ప్రత్యేక అవార్డుల వివరాలు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు - నందమూరి బాలకృష్ణ పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డు - మణిరత్నం బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు - సుకుమార్ నాగిరెడ్డి - చక్రపాణి ఫిల్మ్ అవార్డు - అట్లూరి పూర్ణచంద్రరావు కాంతారావు ఫిల్మ్ అవార్డు - విజయ్ దేవరకొండ రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు - యండమూరి వీరేంద్రనాథ్ ఈ గద్దర్ అవార్డులు తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారనున్నాయని మురళీమోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు.