LOADING...
Gam Gam Ganesha: కామెడీ తో అలరించిన

Gam Gam Ganesha: కామెడీ తో అలరించిన "గం గం గణేశా" ట్రైలర్! 

వ్రాసిన వారు Stalin
May 20, 2024
05:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

బేబి సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ. ఇప్పుడు రాబోయే క్రైమ్ కామెడీ గం గం గణేశతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మూవీ మే 31 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లోకి రానుంది. ఈ చిత్రంతో ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతోంది. ఈ చిత్రం ట్రైలర్ ను మేకర్స్ నేడు రిలీజ్ చేశారు. ట్రైలర్ లో ఆనంద్ దేవరకొండను దొంగగా, ఓ ప్లేబాయ్‌గా కొత్త అవతార్‌లో కనిపిస్తాడు.అయితే ట్రైలర్ ను చూస్తే ఇది ఒక కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ లా అనిపిస్తుంది.

Details 

విగ్రహం చుట్టూనే సినిమా 

ఈ సినిమా కథ ఆద్యంతం ఓ విగ్రహం చుట్టూనే తిరుగుతుంది. డైలాగ్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ముఖ్యం గా ఆనంద్ దేవరకొండ మేకోవర్ చాలా బాగుంది. ట్రెండీ లుక్ లో అలరించారు. ప్రగతి శ్రీవాస్తవ కథానాయికగా నటిస్తుండగా, నయన్ సారిక, వెన్నెల కిషోర్, రాజ్ అర్జున్, సత్యం రాజేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హైలైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందించారు. రిలీజైన ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది అని చెప్పాలి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టీం దేవరకొండ నుండి ట్వీట్