
గేమ్ ఛేంజర్ క్లైమాక్స్: 1200మంది ఫైటర్లతో కళ్లు చెదిరిపోయేలా రామ్ చరణ్ ఫైట్ సీక్వెన్స్
ఈ వార్తాకథనం ఏంటి
దర్శకుడు శంకర్ సినిమాలో భారీ తనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాల్లో గ్రాండియర్ ఉట్టిపడుతుంది.
తాజాగా శంకర్- రామ్ చరణ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. ఈ సినిమా క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీగా ప్లాన్ చేస్తున్నారు.
దాదాపు 1200మంది ఫైటర్స్ తో భారీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేసేందుకు శంకర్ సన్నద్ధమవుతున్నారట. ఈ వార్తతో సినిమాపై హైప్ మరింత పెరిగింది.
యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్‌ను వేస్తున్నారు. ఏప్రిల్ 23 నుంచి జరిగే ఈ షూటింగ్‌లో రామ్ చరణ్ తో పాటు విలన్ ఎస్.జె.సూర్య, 1200మంది ఫైటర్స్ పాల్గొననున్నారు.
ఈ షెడ్యూల్‌లో సినిమాకు సంబంధించిన కీలకమైన క్లైమాక్స్‌ను పూర్తి చేయనున్నారు.
శంకర్
ఒక్క పాటకు రూ.40 కోట్లు ఖర్చు
జెంటిల్‌మన్, ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, అపరిచితుడు, రోబో, 2.0 ఇలా శంకర్ నుంచి వచ్చిన అన్ని సినిమాలు భారీ బడ్జెట్‌తో తీసినవే.
తాజా శంకర్ దర్శకత్వంలో రెండు భారీ బడ్జెట్ సినిమాలు రూపొందుతున్నాయి. అందులో ఒకటి రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ కాగా, మరొకటి కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు 2.
ఇటీవల రామ్ చరణ్ 38వ పుట్టినరోజు సందర్భంగా గేమ్ ఛేంజర్ పోస్టర్‌ను కూడా విడుదల చేసారు.
ఇటీవలే ఇండియన్ 2 సౌతాఫ్రికా షెడ్యూల్‌ను పూర్తి చేసిన శంకర్.. గేమ్ ఛేంజర్ క్లైమాక్స్‌ను త్వరలో చిత్రీకరిస్తామని చెప్పారు. ఇప్పటికే ఈ సినిమాలోని ఒక్క పాటకు 40 కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.