Page Loader
Game Changer: గేమ్ ఛేంజర్ పాటను లీక్ చేసిన వారిని అరెస్టు చేసిన పోలీసులు 
Game Changer: గేమ్ ఛేంజర్ పాటను లీక్ చేసిన వారిని అరెస్టు చేసిన పోలీసులు

Game Changer: గేమ్ ఛేంజర్ పాటను లీక్ చేసిన వారిని అరెస్టు చేసిన పోలీసులు 

వ్రాసిన వారు Stalin
Nov 06, 2023
04:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

సెన్షేషనల్ డైరెక్టర్ శంకర్‌, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలోని ఓ పాట సెప్టెంబర్ 15న ఆన్‌లైన్‌లో లీక్ అయింది. 30 సెకన్ల క్లిప్పింగ్‌తో తెలుగు ఆడియో లీకైన కొద్ది సేపటికే వైరల్‌గా మారింది. దీంతో అప్రమత్తమైన చిత్ర నిర్మాతలు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో పాట లీక్‌కు కారణమైన ఇద్దరు వ్యక్తులను సోమవారం హైదరాబాద్ సైబర్ పోలీసులు అరెస్టు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి లీక్‌లకు పాల్పడవద్దని వార్నింగ్ ఇచ్చారు.

గేమ్ ఛేంజర్

దీపావళి కానుకగా 'జరగండిని' పాట రిలీజ్

అయితే లీకైన పాట ఫైనల్ వెర్షన్ కాదని, ట్రాక్ సింగర్స్ పాడిన మొదటి కాపీ మాత్రమే నిర్మాతలు చెబుతున్నారు. చెన్నైలో 15 కోట్ల బడ్జెట్‌తో పాట చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఈ పాట లీకు కావడంతో చిత్ర బృందం తీవ్ర ఆందోళనకు గురైంది. బహుశా అక్కడి నుంచే లీక్ జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. లీకైన కొద్ది రోజుల తర్వాత ఈ చిత్రం నుంచి మొదటి సింగిల్ 'జరగండిని' దీపావళికి విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. గేమ్ ఛేంజర్ ఒక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కుతోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న తొలి తెలుగు సినిమా ఇది.