Game Changer 'గేమ్ ఛేంజర్' సాంగ్ ప్రోమో వచ్చేసింది.. 'రా మచ్చా మచ్చా'తో హైప్ పెంచిన చిత్ర యూనిట్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 28, 2024
07:26 pm
ఈ వార్తాకథనం ఏంటి
రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం 'గేమ్ ఛేంజర్'. ఇప్పటికే భారీ అంచనాల నడుమ ఈ సినిమా చిత్రీకరణను దాదాపు పూర్తిచేసుకుంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ సెప్టెంబర్ 30న విడుదల చేయబోతున్న పూర్తి లిరికల్ సాంగ్‌కు ముందు ప్రచారంగా 'రా మచ్చా.. మచ్చా' అనే పాట ప్రోమోను విడుదల చేసింది. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, నకాష్ అజీజ్ తన ప్రత్యేక గాత్రంతో ఆలపించారు.