Page Loader
గాండీవధారి అర్జున నుండి మొదటి పాట రిలీజ్: మత్తెక్కించే పాటలో వరుణ్ తేజ్, సాక్షి రొమాన్స్ 
గాండీవధారి అర్జున నుండి మొదటి పాట రిలీజ్

గాండీవధారి అర్జున నుండి మొదటి పాట రిలీజ్: మత్తెక్కించే పాటలో వరుణ్ తేజ్, సాక్షి రొమాన్స్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Jul 31, 2023
05:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వరుణ్ తేజ్ వస్తున్నాడు. ఏజెంట్ ఫేమ్ సాక్షి వైద్య హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమా నుండి నీ జతై సాగింది పాదమే అనే పాట రిలీజైంది. టీజర్ లో పూర్తి యాక్షన్ సీన్లనే చూపించిన చిత్రబృందం, ఈ సినిమాలో రొమాన్స్ కూడా ఉందని తెలియజేయడానికా అన్నట్టు మాంచి రొమాంటిక్ పాటను విడుదల చేసారు. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం, పాడుకోవడానికి వీలుగా ఉండటమే కాకుండా కొత్తగా ఉంది. రెహమాన్ రచించిన గీతానికి ఎల్వియా, నకుల్ అభయాంకర్ తమ గొంతును అందించారు. ఎస్వీసీసీ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా, ఆగస్టు 25న విడుదల అవుతుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పాట విడుదలైందని వరుణ్ తేజ్ ట్వీట్