
Sourav Ganguly: బుల్లితెరపై దుమ్ములేపేందుకు గంగూలీ సిద్ధం.. ఐపీఎల్ కన్నా 5 రెట్లు భారీ రెమ్యూనరేషన్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ క్రికెట్‌లో దాదా అనగానే గుర్తొచ్చే పేరు సౌరబ్ గంగూలీ. కేవలం ఆటగాడిగా మాత్రమే కాకుండా, మ్యాచులో ఫియర్‌లెస్ లీడర్‌గా, ఆత్మవిశ్వాసంతో జట్టును ముందుకు నడిపించిన సారథిగా క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న వ్యక్తి.
బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా సేవలందించిన గంగూలీ, ప్రస్తుతం మైదానానికి కాస్త దూరంగా ఉన్నా... ఇప్పుడు మరో వేదికపై తన ప్రభావాన్ని చూపేందుకు సిద్ధమయ్యాడు.
సౌరవ్ గంగూలీ ఇప్పుడు రెండు కొత్త టెలివిజన్ షోలతో బుల్లితెరపై రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
హోస్ట్‌గా మళ్లీ టీవీ కెరీర్ ప్రారంభించేందుకు సిద్దమైన ఆయన, స్టార్ జల్సా అనే ప్రసిద్ధ బెంగాలీ టీవీ ఛానెల్‌తో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు.
ఈ ఒప్పందం నాలుగు సంవత్సరాల వ్యవధికి గాను రూ.125 కోట్ల విలువైనదిగా భావిస్తున్నారు.
Details
2026 జూలై నుండి ప్రారంభం
ఈ డీల్ ప్రకారం, గంగూలీ రెండు షోలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
అందులో ఒకటి ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ బంగ్లా, మరొకటి మెదడుకు మేళం వేసే క్విజ్ షో. ఈ రెండు షోలు 2026 జూలై నుండి ప్రసారమవుతాయి.
హై ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో ఈ కార్యక్రమాలను తెరకెక్కించనున్నారు. ఈ ప్రాజెక్టుల ప్రీ-ప్రొడక్షన్, షూటింగ్ వర్క్ 2025 జూలై నుండి ప్రారంభం కానుంది.
జీ బంగ్లా నుంచి స్టార్ జల్సాకు
ఇప్పటికే 'దాదాగిరి' అనే ప్రసిద్ధ క్విజ్ షోకు జీ బంగ్లా ఛానెల్‌లో హోస్ట్‌గా వ్యవహరించిన గంగూలీ, ఆ షోకు వీడ్కోలు చెప్పి ఇప్పుడు కొత్త ఛానెల్‌తో తన కొత్త ప్రయాణం ప్రారంభించనున్నాడు.
Details
ఇది నా కొత్త ఇన్నింగ్స్: గంగూలీ
ఈ సందర్భంగా గంగూలీ తన భావాలను ఇలా వ్యక్తీకరించాడు ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి టెలివిజన్ ఎప్పుడూ తనకు ఓ ప్రత్యేకమైన వేదిక అని చెప్పారు.
ఇప్పుడు స్టార్ జల్సాతో కలిసి నాన్-ఫిక్షన్ కార్యక్రమాల ద్వారా కథల్ని చెప్పే అవకాశాన్ని పొందడం ఆనందంగా ఉందన్నారు.
మైదానానికి బయట ప్రేక్షకులతో బంధం ఏర్పరచుకోవడం తనకు ఎంతో విశ్వాసం కలిగించే విషయమని గంగూలీ చెప్పారు.
క్రీడారంగాన్ని ఆకట్టుకున్న దాదా, ఇప్పుడు వినోదరంగానికీ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. గంగూలీ ఈ కొత్త ప్రయాణంలో ఏవిధంగా మెరుస్తాడో వేచి చూడాల్సిందే.