Saripoda Sanivaram: 'సరిపోదా శనివారం' నుండి 'గరం గరం' సాంగ్ విడుదల
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని 'సరిపోదా శనివారం' మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'గరం గరం యముడయో' అంటూ సాగిన ఈ పాట ఓ డిఫరెంట్ ఫీల్ అందించింది. జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ విశాల్ దద్లానీ వాయిస్ తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగిస్తోంది. ఈ పాటలో నాని రగ్గ్‌డ్ లుక్ లో అక్కడక్కడా కనిపించాడు.గతంలో నానితో కలిసి అంటే సుందరానికి మూవీ తీసిన వివేక్ ఆత్రేయనే మరోసారి ఓ డిఫరెంట్ టైటిల్, స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమాలో నానిని పూర్తి క్లాస్ లుక్ లో చూపించారు.కాగా..ఈ మూవీలో క్లాస్, మాస్ కలగలసిన లుక్ తో తీసుకురాబోతున్నాడు.