Gautam Ghattamaneni Ramayana Review: రామాయణం చూసి ఫిదా.. గౌతమ్ ఇచ్చిన రేటింగ్ ఇప్పుడు వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని మరోసారి సినిమాలపై తన అభిప్రాయంతో వార్తల్లో నిలిచాడు. త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇస్తాడనే ప్రచారం జరుగుతున్న గౌతమ్.. ఇప్పటికే సినిమాలు చూస్తూ తనదైన రివ్యూలు, రేటింగ్‌లతో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తాజాగా నితేష్ తివారీ తెరకెక్కించిన 'రామాయణ' సినిమాను చూసిన గౌతమ్ ఏకంగా 4.5 రేటింగ్ ఇచ్చాడు. ఇప్పటివరకు పలు సినిమాలకు తక్కువ రేటింగ్‌లు ఇచ్చిన అతడు.. ఈ చిత్రానికి మాత్రం భారీ స్కోర్ ఇవ్వడం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. సినిమా తనను పూర్తిగా ఆకట్టుకుందని చెప్పడంతో ఈ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Details
రణ్‌బీర్ కంటే యష్ నటనకే ఎక్కువగా ఫిదా
'రామాయణ' చూసిన తర్వాత తనకు మాటలు రావడం లేదని గౌతమ్ చెప్పాడు. సినిమాలోని సీజీఐ, స్క్రిప్ట్, దర్శకత్వం, నటన అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించాడు.
రాముడి పాత్రలో రణ్ బీర్ కపూర్ ఎప్పటిలాగే మంచి నటన చూపించారని పేర్కొన్నాడు. అయితే రావణుడిగా కనిపించిన యష్ నటన మాత్రం తనను ప్రత్యేకంగా ఆకట్టుకుందని చెప్పాడు.
యష్ పెర్ఫార్మెన్స్ అసాధారణంగా ఉందంటూ ప్రశంసలు కురిపించాడు. భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పే చిత్రంగా 'రామాయణ' నిలుస్తుందని గౌతమ్ అభిప్రాయపడ్డాడు.
Details
భారీ తారాగణంతో తెరకెక్కిన రామాయణ
'రామాయణ'లో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటించారు.
వీరితో పాటు సన్నీ డియోల్, శోభన, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్, కునాల్ కపూర్, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
భారీ బడ్జెట్‌తో ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్, డీఎన్‌ఈజీ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి.
Details
హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మరో హైలైట్
సినిమాకు సంగీతం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్, భారతీయ సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ కలిసి 'రామాయణ'కు స్వరాలు అందించారు.. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఇప్పటికే గౌతమ్ ఇచ్చిన 4.5 రేటింగ్‌తో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
సినిమాల్లోకి హీరోగా అడుగుపెట్టకముందే గౌతమ్ రివ్యూలతో ఇంతటి ఆసక్తిని రేపడం కూడా ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.