LOADING...
Gautham Menon: గౌతమ్ మీనన్‌కు షాక్..వడ్డీతో సహా డబ్బులు చెల్లించాలన్న కోర్టు!
గౌతమ్ మీనన్‌కు షాక్..వడ్డీతో సహా డబ్బులు చెల్లించాలన్న కోర్టు!

Gautham Menon: గౌతమ్ మీనన్‌కు షాక్..వడ్డీతో సహా డబ్బులు చెల్లించాలన్న కోర్టు!

వ్రాసిన వారు Moogati Shabari
Mar 25, 2026
03:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్లాసికల్ లవ్ స్టోరీలతో మంచి పేరు తెచ్చుకున్న గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రస్తుతం తన జీవితంలో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నారు. మణిరత్నం తరువాత ఈ తరహా ప్రేమకథలను తెరకెక్కించిన దర్శకుడిగా గుర్తింపు పొందిన ఆయన, ఇటీవల తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. చియాన్ విక్రమ్‌తో తెరకెక్కించిన 'థ్రువ నక్షత్రం' సినిమా విడుదల ఇంకా ఆలస్యమవుతుండగా, ఆయన కొంతకాలం దర్శకత్వానికి విరామం ఇచ్చి నటనపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్య పాత్రలో నటించిన 'కార్మెనీ సెల్వం' విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో మద్రాస్ హైకోర్టు నుంచి అనూహ్యమైన షాక్ ఎదురైంది.

వివరాలు 

కోర్టులో వాదనలు

2008లో ప్రారంభమైన ఒక వివాదం ఇప్పుడు మళ్లీ గౌతమ్ మీనన్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది. తన నిర్మాణ సంస్థ ఫోటాన్ ఫ్యాక్టరీతో పాటు ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్‌తో కలిసి ఒక సినిమా చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఆ సంస్థ నుంచి దాదాపు రూ.4.25 కోట్లను విడతలుగా స్వీకరించారు. 2009 నాటికి సినిమా పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ, ఆ ప్రాజెక్ట్ ప్రారంభం కూడా కాలేదు. తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మొదట సింగిల్ బెంచ్ ఆ సంస్థకు అనుకూలంగా తీర్పు ఇవ్వగా, గౌతమ్ మీనన్ తీర్పును సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా డబ్బులు తిరిగి చెల్లించకుండా ఉండేందుకు కోర్టులో తప్పుదారి పట్టించే వాదనలు కూడా చేశారు.

వివరాలు 

గౌతమ్ మీనన్‌కు భారీ షాక్

ఆ సినిమాకు అవసరమైన బడ్జెట్‌ను ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ సమకూర్చకపోయినా, తాము 'నీతానే ఎన్ పొన్ వసంతం/ఎటో వెళ్లిపోయింది మనసు' సినిమాను రూపొందించామని గౌతమ్ మీనన్ కోర్టుకు తెలిపారు. అయితే ఆ సినిమా పూర్తిగా వేరే ఒప్పందం ప్రకారం రూపొందించబడిందని కోర్టు గుర్తించింది. దీంతో ఆయన వాదనలను కొట్టివేసిన న్యాయస్థానం తీవ్రంగా మందలించింది. అంతేకాకుండా ఆర్ఎస్ సంస్థ ఇచ్చిన మొత్తాన్ని, దానిపై సంవత్సరానికి 12 శాతం వడ్డీతో కలిపి తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుతో గౌతమ్ మీనన్‌కు భారీ దెబ్బ తగిలినట్టైంది.

Advertisement