Geetanjali Malli Vachindhi:'గీతాంజలి మళ్లీ వస్తోంది...తెర వాహయామి''
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు అమ్మాయి అంజలి ప్రధాన పాత్రలో పదేళ్ల క్రితం వచ్చిన హర్రర్ కామెడీ చిత్రం గీతాంజలి.
ప్రేక్షకుల్ని నవ్విస్తూనే భయపెట్టింది.ఈ హర్రర్ కామెడీ జోనర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన 'గీతాంజలి' సినిమా అప్పట్లో తెలుగుప్రేక్షకులను ఒక ఊపు ఊపింది.
షకలక శంకర్, సప్తగిరి అల్టిమేట్ కామెడీ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా 'గీతాంజలి మళ్లి వచ్చింది' పేరుతో ఈనెల 11న రిలీజ్ చేసేందుకు చిత్రయూనిట్ ప్రయత్నిస్తోంది.
ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, సాంగ్ లకు పాజిటివ్ బజ్జే వచ్చింది.
మేకర్స్ ట్రైలర్ ను కాసేపటి క్రితమే విడుదల చేశారు.
Details
సినిమా విడుదలైతే ప్రేక్షకులకు పూనకాలు
కోనవెంకట్ నిర్మాణంలో శివ తుర్లపాటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
స్మశాన వాటికలో వేసిన సెట్ తో ప్రారంభమైన టీజర్ విడుదల తర్వాత సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.
అంజలి ప్రధాన పాత్రలో వస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా విడుదలైతే ప్రేక్షకులకు పూనకాలు తప్పవేమో!
తెలుగు ప్రాంతానికి చెందిన అంజలి తనదైన నటనతో ప్రేక్షకుల్ని ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తూనే ఉంది.
తన ప్రతిభతో ఇన్నాళ్లుగా చిత్రపరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగడం ఒకరకంగా ఆమె అదృష్టమనే చెప్పాలి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కోన వెంకట్ చేసిన ట్వీట్
Thank uuuu for the Tremendous response to our Trailer of
— KONA VENKAT (@konavenkat99) April 3, 2024
"గీతాంజలి మళ్ళీ వచ్చింది"
The most awaited mash-up of fun & fear is here‼️
Watch the trailer of #GeetanjaliMalliVachindhi👇https://t.co/AwPt9juJHj
Grand Release World Wide on April 11th@yoursanjali #GMVTrailer… pic.twitter.com/JfXXigtBjF