Page Loader
Geethanjali Malli Vachindi: గీతాంజలి అక్క మళ్ళీ వచ్చింది.. ఓటిటి ప్రీమియర్ తేదీ ఖరారు 
గీతాంజలి అక్క మళ్ళీ వచ్చింది.. ఓటిటి ప్రీమియర్ తేదీ ఖరారు

Geethanjali Malli Vachindi: గీతాంజలి అక్క మళ్ళీ వచ్చింది.. ఓటిటి ప్రీమియర్ తేదీ ఖరారు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 06, 2024
01:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు అమ్మాయి అంజలి ప్రధాన పాత్రలో పదేళ్ల క్రితం వచ్చిన హర్రర్ కామెడీ చిత్రం గీతాంజలి. ప్రేక్షకుల్ని నవ్విస్తూనే భయపెట్టింది. ఈ హర్రర్ కామెడీ సినిమాకు సీక్వెల్ గా 'గీతాంజలి మళ్లి వచ్చింది' సినిమా గత నెలలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం చూస్తున్న వారికి సర్ప్రైజింగ్ న్యూస్. ఆహా, డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్,ఈ సినిమా హక్కులను పొందింది. మే 8, 2024న దాని ప్రీమియర్‌ను ప్రకటించింది. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. శ్రీనివాస్ రెడ్డి,సత్యం రాజేష్,సత్య,షకలక శంకర్,సునీల్,అలీ,రవిశంకర్,రాహుల్ మాధవ్ కీలక పాత్రలలో నటించారు. కోన వెంకట్,ఎంవివి సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆహా లో కలుద్దాం అక్క..