LOADING...
Kriti Sanon: 'లింగ వివక్ష ఇంకా ఇండస్ట్రీలో ఉంది'.. కృతి సనన్‌ సంచలన వ్యాఖ్యలు!
'లింగ వివక్ష ఇంకా ఇండస్ట్రీలో ఉంది'.. కృతి సనన్‌ సంచలన వ్యాఖ్యలు!

Kriti Sanon: 'లింగ వివక్ష ఇంకా ఇండస్ట్రీలో ఉంది'.. కృతి సనన్‌ సంచలన వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 02, 2025
10:59 am

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ హీరోయిన్‌ కృతి సనన్‌ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఆమెను ఐక్యరాజ్యసమితి పాపులేషన్‌ ఫండ్‌ (UNFPA) ఇండియా లింగ సమానత్వ గౌరవ రాయబారిగా నియమించింది. ఈ సందర్భంగా కృతి చిత్ర పరిశ్రమలో లింగ వివక్షపై తన అనుభవాలను పంచుకున్నారు. ఇండస్ట్రీలో హీరోలకు దక్కే సౌకర్యాలు, గౌరవం హీరోయిన్‌లకు ఉండవు. చిన్న విషయాలు అనిపించినా పెద్ద తేడా ఉంటుంది. ఉదాహరణకు హీరోలకు విలాసవంతమైన కార్లు, లగ్జరీ గదులు కేటాయిస్తారు. కానీ, హీరోయిన్‌లకు అలాంటివి ఉండవు. కార్ల గురించే కాదు.. మహిళలను తక్కువ చేసి చూడడమే సమస్య. హీరోలతో సమాన గౌరవానికి మేము కూడా అర్హులమే. షూటింగ్‌ సమయంలో హీరోలు ఆలస్యంగా వస్తారు.

Details

ఆలోచన విధానం మారాలి

అయితే మేము మాత్రం టైం కంటే ముందే వెళ్లి ఎదురుచూడాలి. అసిస్టెంట్‌ డైరెక్టర్లు మమ్మల్ని పిలుస్తారు కానీ హీరోలతో అలా మాట్లాడరు. ఈ ఆలోచనా విధానం మారాల్సిన అవసరం ఉందని కృతి స్పష్టం చేశారు. అంతేకాక తన తల్లి గురించి కూడా కృతి ప్రస్తావించారు. 'మా అమ్మ పెరిగిన కాలంలో పురుషులను ఎక్కువగా గౌరవించే వాతావరణం ఉండేది. మహిళలు వంటగదికి మాత్రమే పరిమితం అన్న భావన ఎక్కువగా ఉండేది. ఈత, నృత్యం నేర్చుకోవాలని ఆమె కలలు కన్నా ఆ సమాజ పరిస్థితుల వల్ల సాధ్యం కాలేదు. చదువు కోసం ఆమె బాగా పోరాడింది. ఆ పోరాటస్ఫూర్తే మాకు ప్రేరణ. మమ్మల్ని, మా సోదరిని ఆత్మవిశ్వాసంతో పెంచింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛనిచ్చిందని తెలిపారు.