LOADING...
Ghati OTT : క్రిష్ దర్శకత్వంలో ఘాటి.. ఓటీటీ ప్లాట్‌ఫామ్ క్లారిటీ వచ్చేసింది!
క్రిష్ దర్శకత్వంలో ఘాటి.. ఓటీటీ ప్లాట్‌ఫామ్ క్లారిటీ వచ్చేసింది!

Ghati OTT : క్రిష్ దర్శకత్వంలో ఘాటి.. ఓటీటీ ప్లాట్‌ఫామ్ క్లారిటీ వచ్చేసింది!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 05, 2025
02:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఘాటి' చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి, లెజెండరీ తమిళ నటుడు శివాజీ గణేషన్ మనవడు విక్రమ్ ప్రభు కీలక పాత్రలు పోషించారు. చింతకింద శ్రీనివాస్ అందించిన కథను రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మించారు. చైతన్య రావు మదాడి, జగపతిబాబు, జిషు సేన్ గుప్తా, జాన్ విజయ్, రవీంద్ర విజయ్, వీటీవీ గణేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. యాక్షన్ క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. ఘాటి ప్రీమియర్ షోలు ఇప్పటికే నార్త్ అమెరికా సహా ఓవర్సీస్ మార్కెట్లలో ప్రదర్శించబడ్డాయి.

Details

 అమెజాన్ ప్రైమ్ కే ఓటీటీ హక్కులు

అక్కడినుంచి బయటకు వచ్చిన నెటిజన్లు, క్రిటిక్స్ అభిప్రాయాలను పరిశీలిస్తే- ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని చాలా మంది రాసుకొచ్చారు. ముఖ్యంగా అనుష్క శెట్టి 'శీలావతి' పాత్రలో అదరగొట్టేసిందని, క్రిష్‌కి ఇది పక్కా కమ్‌బ్యాక్ అనిపించిందని అంటున్నారు. బీజీఎం, ఫైట్ సీన్స్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయని, ప్రీ క్లైమాక్స్‌తో పాటు క్లైమాక్స్ ఎపిసోడ్స్ మరింత థ్రిల్లింగ్‌గా ఉన్నాయని పేర్కొంటున్నారు. ట్రైన్ సీక్వెన్స్ వేరే లెవెల్‌లో ఉందని, సెకండ్ హాఫ్ 'ఫుల్ మీల్స్'లా అనిపిస్తుందని రివ్యూలలో చెబుతున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా ఈ మూవీ ఓటిటి హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు సమాచారం.