LOADING...
Ghaati : ఘాటి రిలీజ్ డేట్ ఫిక్స్‌.. జూలై 11న గ్రాండ్ రిలీజ్‌!
ఘాటి రిలీజ్ డేట్ ఫిక్స్‌.. జూలై 11న గ్రాండ్ రిలీజ్‌!

Ghaati : ఘాటి రిలీజ్ డేట్ ఫిక్స్‌.. జూలై 11న గ్రాండ్ రిలీజ్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 02, 2025
04:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా 'ఘాటీ'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్‌లో 'లేడీ సూపర్‌స్టార్'గా పేరుగాంచిన అనుష్క శెట్టి తాజా చిత్రం 'ఘాటీ'పై సినీ అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2025 జూలై 11న విడుదల కానుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో అనుష్క అభిమానుల్లో అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ చిత్రం అనుష్క కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు.

Details

దేశీ రాజు పాత్రలో విక్రమ్ ప్రభు

'ఘాటీ' ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా కాగా, ఇందులో అనుష్క ఒక గ్రామీణ మహిళగా, సామాన్యురాలిగా మొదలై నేరాల ప్రపంచంలోకి అడుగుపెట్టి చివరకు ఓ లెజెండ్‌గా ఎలా మారింది అన్న కథాంశం చుట్టూ సాగుతుంది. ఈ సినిమాలో అనుష్కతో పాటు విక్రమ్ ప్రభు, రమ్యకృష్ణ, జగపతి బాబు, చైతన్య రావు వంటి ప్రముఖులు నటిస్తున్నారు. తమిళ నటుడు విక్రమ్ ప్రభు ఈ చిత్రంతో తన మొదటి తెలుగు సినిమా చేయడం విశేషం. ఇందులో ఆయన దేశీ రాజు అనే పాత్రలో కనిపించనున్నారు. కథను చింతకింది శ్రీనివాస రావు రచించగా, సంభాషణలు సాయి మాధవ్ బుర్రా అందించారు.

Details

రీషూటింగ్ కారణంగా వాయిదా

సంగీతానికి నాగవెల్లి విద్యా సాగర్, సినిమాటోగ్రఫీకి మనోజ్ రెడ్డి కటసాని, ఆర్ట్ డైరెక్షన్‌కు తోట తరణి వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అసలు ఈ సినిమా 2025 ఏప్రిల్ 18న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని పోస్ట్-ప్రొడక్షన్ పనులు ఇంకా రీషూట్‌లు కారణంగా వాయిదా పడింది. తాజాగా జూన్ 1, 2025న ఎక్స్‌ (పూర్వం ట్విట్టర్‌) ద్వారా ఈ చిత్రం జూలై 11న విడుదల కానుందని నిర్మాతలు ప్రకటించారు.