Rajamouli: గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్ హంగామా.. దర్శకుడు రాజమౌళిపై కేసు నమోదు!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళిపై సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇటీవల జరిగిన గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌లో హనుమంతుడిపై ఆయన చేసిన వ్యాఖ్యలు హిందూ భావాలను దెబ్బతీశాయని ఆరోపిస్తూ, రాష్ట్రీయ వానరసేన సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటన ఎలా జరిగిందంటే... మహేశ్ బాబు హీరోగా రాజమౌళి రూపొందించనున్న పాన్‌ఇండియా ప్రాజెక్ట్ 'వారణాసి' శీర్షికను ఇటీవల ఘనంగా లాంచ్ చేశారు. అయితే చిన్న సాంకేతిక లోపం కారణంగా ఈవెంట్‌కు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. ఈ సమయంలో రాజమౌళి భావోద్వేగానికి లోనై, తన వ్యక్తిగత నమ్మకాల గురించి వ్యాఖ్యానించారు.
Details
రాజమౌళిపై హిందూ సంఘాల కేసు
అప్పుడు రాజమౌళి మాట్లాడుతూ "నాకు దేవుడిపై నమ్మకం లేదు. మా నాన్న 'హనుమంతుడు వెనక నిలబడి నడిపిస్తాడని చెప్పడంతో అప్పుడు నాకు కోపం వచ్చింది. నా భార్యకు హనుమంతుడు అంటే చాలా ఇష్టం. ఆమె ఆయనను స్నేహితుడిలా భావిస్తుంది. అదే సమయంలో నాకు ఆమె మీద కూడా కోపం వచ్చింది. ఇదేనా ఆయన చేసేది? అన్న భావన వచ్చిందని తెలిపారు. ఈ వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. దీంతో హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజమౌళిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.