Ranya Rao: బంగారం అక్రమ రవాణా.. నటి రన్యారావు శరీరంపై గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టైన నటి రన్యారావు వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
విచారణలో భాగంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంచలన విషయాలు వెల్లడించింది. రన్యారావు శరీరంపై అనేక గాయాలు ఉన్నాయని పేర్కొంది.
డీఆర్‌ఐ తెలిపిన ప్రకారం, రన్యారావు వీఐపీ ప్రోటోకాల్స్‌ను దుర్వినియోగం చేస్తూ ఓ అంతర్జాతీయ ముఠాలో భాగమై బంగారం అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు.
ఆమె శరీరంపై ఉన్న గాయాలు ఇప్పటికే ఉన్నవేనని, దుబాయ్ వెళ్లడానికి ముందే వచ్చినవని నటి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
దీంతో కోర్టు ఆమెకు తగిన వైద్య సహాయం అందించాల్సిందిగా జైలు అధికారులను ఆదేశించింది.
Details
సహకరించడం లేదని కోర్టుకు నివేదించిన డీఆర్ఐ
అయితే విచారణలో ఆమె పూర్తిగా సహకరించడం లేదని డీఆర్‌ఐ కోర్టుకు నివేదించింది.
శుక్రవారం కోర్టులో హాజరైన రన్యారావు న్యాయమూర్తి ముందు కన్నీరు పెట్టుకున్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి మూడు రోజుల పాటు ఆమెను విచారించేందుకు అనుమతిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటికే డీఆర్‌ఐ అధికారులు రన్యారావు వద్ద నుంచి 14.2 కిలోల బంగారు బిస్కెట్లు, సుమారు రూ.2.06 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.2.67 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.
గత ఆరు నెలల్లో ఆమె 27 సార్లు దుబాయ్ ప్రయాణించినట్లు గుర్తించారు. అలాగే, సౌదీ అరేబియా, అమెరికా, పశ్చిమాసియా, ఐరోపా దేశాలకు కూడా ఆమె విస్తృతంగా ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు.