
Ilaiyaraaja: ఇళయరాజా పిటిషన్ కారణంగా నెట్‌ఫ్లిక్స్ నుంచి 'గుడ్ బ్యాడ్ అగ్లీ' తొలగింపు!
ఈ వార్తాకథనం ఏంటి
అగ్రకథానాయకుడు అజిత్ కుమార్ నటించిన చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ' (Good Bad Ugly)ను నెట్‌ఫ్లిక్స్ నుండి తొలగించారు. ఈ సినిమా చుట్టూ నెలకొన్న వివాదం తర్వాత, కోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు నెట్‌ఫ్లిక్స్ స్పష్టంచేసింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్‌లో థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ పొందింది. అనంతరం మే 8న నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ ప్రారంభమైంది. చిత్రంలో కొన్ని పాటలను అనుమతి లేకుండా ఉపయోగించారని ఆరోపిస్తూ ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కోర్టులో పిటిషన్ వేసారు.
Details
కాపీరైట్ చట్టవిరుద్దం
ఆయన పిటిషన్‌లో, ఈ పాటల వినియోగం కాపీరైట్ చట్టానికి విరుద్ధమని, వాటిని తొలగించి, తగిన పరిహారం ఇవ్వాలని కోరారు. మద్రాసు హైకోర్టు విచారణ తర్వాత, ఈ పాటలను సినిమాలో ప్రదర్శించరాదని ఆదేశించింది. ఈ వివాదం కారణంగా, నెట్‌ఫ్లిక్స్ తన వేదిక నుంచి 'గుడ్ బ్యాడ్ అగ్లీ'ని తొలగించేందుకు ఆదేశాలు పాటించింది. చిత్ర నిర్మాత రవి మీడియాతో మాట్లాడుతూ, విడుదలకు ముందే అన్ని అనుమతులు (permissions) తీసుకున్నట్టు తెలిపారు. పాటలను నిబంధనలకు అనుగుణంగా ఉపయోగించినట్టు, సక్రమంగా ప్రయత్నం చేసినట్టు ఆయన స్పష్టం చేశారు.